ETV Bharat / city

రాష్ట్ర ఎన్నికల సంఘం పట్ల ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టిన హైకోర్టు - రాష్ట్ర ఎన్నికల సంఘంపై హైకోర్టు వ్యాఖ్యలు

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు...ప్రభుత్వం సహాయ సహకారాలు అందించకపోవడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఎస్​ఈసీ అభ్యర్థనలపై సక్రమంగా స్పందించలేదన్న విషయం స్పష్టంగా నిరూపితమైందని తేల్చిచెప్పింది. సమగ్ర వివరాలతో 3 రోజుల్లోగా ప్రభుత్వానికి వినతి సమర్పించాలని ఎస్​ఈసీకి సూచించిన ధర్మాసనం...దానిపై స్పందించి తక్షణమే ఆర్థిక, ఆర్థికేతర సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించింది.

రాష్ట్ర ఎన్నికల సంఘం పట్ల ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టిన హైకోర్టు

author img

By

Published : Nov 4, 2020, 5:07 AM IST

నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించడంలో సహాయ, సహకారాలు అందించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ గతంలో హైకోర్టును ఆశ్రయించారు. అనుబంధ వ్యాజ్యాలపై ఇటీవల విచారణ జరిపిన ధర్మాసనం అప్పుడు నిర్ణయాన్ని వాయిదా వేసి, మంగళవారం తీర్పు వెల్లడించింది. ఎస్​ఈసీ, ప్రభుత్వం మధ్య ఈ విధమైన పరిస్థితులు నెలకొనడం అత్యంత దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. అంతా సవ్యంగా లేదన్న విషయాన్ని రుజువు చేస్తున్నాయని పేర్కొంది. సహాయ సహకారాల కోసం....సమగ్ర వివరాలతో 3 రోజుల్లోగా ప్రభుత్వానికి వినతి సమర్పించాలని ఎస్​ఈసీకి సూచించింది. దానిపై స్పందించి తక్షణమే ఆర్థిక, ఆర్థికేతర సహాయ సహకారాలు అందించాలని ప్రతివాదులుగా ఉన్న పంచాయతీరాజ్‌, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శులను ఆదేశించింది. ఆదేశాలను వారు అమలు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. సీఎస్‌ను ఈ వ్యాజ్యంలో.... సుమోటోగా ప్రతివాదిగా చేర్చింది. కోర్టు ఉత్తర్వుల అమలుపై 15 రోజుల్లో స్థాయీ నివేదిక సమర్పించాలని సీఎస్‌కు స్పష్టం చేసింది.

తీర్పు సందర్భంగా పలు విషయాల్లో ధర్మాసనం ఘాటుగా స్పందించింది. వ్యవస్థలు శాశ్వతం... పదవుల్లో ఉన్న వ్యక్తులు తాత్కాలికమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలంది. ప్రజాస్వామ్య స్తంభాలైన రాజ్యాంగ వ్యవస్థలు దేశంలో పవిత్రతను కలిగి ఉన్నాయన్న ధర్మాసనం...వాటిపై కొందరి ఉద్దేశాలకు ఎక్కువ విలువిస్తూ ప్రోత్సహించడం...వ్యవస్థల పవిత్రతను కించపరచడమే అవుతుందని వ్యాఖ్యానించింది. ఎస్​ఈసీ స్వయంప్రతిపత్తి కలిగిన స్వతంత్ర, రాజ్యాంగబద్ధ సంస్థే తప్ప.... రాష్ట్ర ప్రభుత్వం కింద పనిచేసేది కాదని స్పష్టం చేసింది. ఎస్​ఈసీ స్వతంత్రంగా, నిష్పాక్షికంగా విధులు నిర్వర్తించేందుకు సహకారం అందించాల్సిందేనని తేల్చిచెప్పింది. ఎస్​ఈసీ ప్రస్తావించిన సమస్యలను పరిశీలిస్తే...రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినట్లు స్పష్టమవుతోందని వ్యాఖ్యానించింది.ఎస్​ఈసీ విధులకు తీవ్ర అడ్డంకులు కలిగించినట్లు అర్థమవుతోందని పేర్కొంది. సహాయ సహకారాల కోసం, న్యాయవాదుల ఫీజుల చెల్లింపునకు నిధులు విడుదల చేయాలంటూ....ఎస్​ఈసీ ప్రభుత్వానికి పలు లేఖలు రాసినట్లు ధర్మాసనం ప్రస్తావించింది. తీవ్రమైన నిధుల కొరతను ఎదుర్కొంటున్నట్లుగా ఎస్‌ఈసీ తరఫు సీనియర్‌ న్యాయవాది చెప్పారని పేర్కొంది.

ఎస్​ఈసీ లేఖపై పంచాయతీరాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి గత జులై 29న బదులిస్తూ....ఎస్‌ఈసీ తన అధికారులతో న్యాయస్థానాల్లో సమాధానం ఇప్పించవచ్చని... న్యాయవాదులను నియమించుకోనక్కర్లేదని పేర్కొనడాన్ని ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టింది. ఆ వాదనను అంగీకరించలేమని...ఎంత మాత్రం సమర్థనీయం కాదని పేర్కొంది. సంబంధిత అధికారులకు కోర్టు కార్యకలాపాలపై కనీస పరిజ్ఞానం లేదని అభిప్రాయపడింది. ఎస్​ఈసీ పట్ల ప్రభుత్వ వైఖరిని ఆ లేఖే రుజువు చేస్తోందని వ్యాఖ్యానించింది. ఎస్​ఈసీకి సకాలంలో 40 లక్షల రూపాయలు విడుదల చేయకుండా...పెండింగ్‌లో ఉంచడం సమర్థనీయం కాదని పేర్కొంది. ఎస్​ఈసీ కోర్టులో పిటిషన్‌ వేశాక...10 నెలల పాటు పెండింగ్‌లో ఉన్న నిధులను విడుదల చేశారని...ఇదే ప్రభుత్వ వైఖరిని తెలియచేస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎన్నికల నిర్వహణకు...వివిధ తేదీల్లో ప్రభుత్వం 117 కోట్లు విడుదల చేసిందని ప్రభుత్వ న్యాయవాది చెప్పినా....ఆ సొమ్ము ఎస్​ఈసీ పరిపాలనా నిర్వహణ, న్యాయవాదుల ఫీజులకు ఖర్చు చేయలేరని అభిప్రాయపడింది.

ఇదీచదవండి

మూడు రాజధానుల నిర్ణయం అనాలోచితం: సుప్రీంకోర్టు న్యాయవాది శ్యాం దివాన్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.