ETV Bharat / city

దుర్గగుడిలో అక్రమార్కులపై వేటు.. 15మంది ఉద్యోగుల సస్పెన్షన్ - విజయవాడ దుర్గగుడి తాజా వార్తలు

విజయవాడ దుర్గగుడిలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఐదు రోజుల పాటు విస్తృతంగా తనిఖీలు చేసి.. ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందజేశారు. ప్రాథమిక నివేదిక ఆధారంగా 15 మందిని దేవదాయ శాఖ అధికారులు సస్పెండ్‌ చేశారు. తుది నివేదికను బట్టి కీలకమైన వ్యక్తులపైనా చర్యలు చేపట్టే అవకాశముంది.

ACB. Report
దుర్గగుడిలో సోదాలపై ప్రభుత్వానికి అ.ని.శా ప్రాథమిక నివేదిక
author img

By

Published : Feb 23, 2021, 10:35 AM IST

Updated : Feb 24, 2021, 3:26 AM IST

రాష్ట్రంలో రెండో అతి పెద్ద దేవాలయంగా గుర్తింపు పొందిన విజయవాడ దుర్గగుడిలో ప్రక్షాళన ప్రారంభమయ్యింది. ఒకేసారి 15 మంది ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఇందులో ముగ్గురు ఆర్థిక లావాదేవీలలో అక్రమాలకు పాల్పడినట్లు తేలగా మిగిలిన వారు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు వారిని ఉద్యోగాల నుంచి తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సురేష్‌ బాబు పేర్కొన్నారు. గుడిలో అక్రమాలపై ఇటీవల అవినీతి నిరోధక శాఖ (అనిశా)కు పలు ఫిర్యాదులు అందాయి. జనసేన నాయకుడు పోతిన మహేష్‌ దుర్గగుడి అక్రమాలపై విచారణ చేయాలని కోరుతూ అనిశాకు, దేవదాయ శాఖ కమిషనరుకు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల విజయవాడ రేంజి అధికారులు 18 నుంచి 20వ తేదీ వరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనంతరం దేవదాయ శాఖ కమిషనర్‌కు నివేదిక అందించారు. దీని ఆధారంగా ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ ఆదేశాలు జారీచేశారు.

మంగళవారం సాయంత్రం వరకు మొత్తం 15 మంది ఉద్యోగులు సస్పెండయ్యారు. వీరిలో సూపరింటెండెంట్లు శ్రీనివాసమూర్తి (అన్నదానం), చందుశ్రీ (దేవాలయం), అమృతరావు (రిసెప్షన్‌), హరికృష్ణ (అకౌంట్సు), భాగ్యజ్యోతి (పూజలు), కొర్రెల శ్రీనివాసరావు (లీజులు), రవిప్రసాద్‌ (సెక్యూరిటీ), సీనియర్‌ అసిస్టెంట్లు యశ్వంత్‌, నాగేశ్వరరావు, రవికుమార్‌, రమేష్‌, జూనియర్‌ అసిస్టెంట్లు ప్రకాష్‌, రాంబాబు, చెన్నకేశవరావు, రికార్డు అసిస్టెంటు ఏడుకొండలు ఉన్నారు.
దర్శన టికెట్ల అమ్మకాల్లో అవకతవకలు జరిగినా ఉద్యోగులు గుర్తించలేకపోయారని అనిశా నివేదించింది. అన్నదానం విభాగంలో కూరగాయలు, పాలు, ఇతర ఆహార పదార్థాలకు లెక్కలు లేవు. ఓ దాత నుంచి రూ.54,31,382 విరాళం అందితే ఎక్కడ డిపాజిట్‌ చేశారో చూపలేదు. సందీప్‌కుమార్‌రెడ్డి అనే ఉద్యోగి రెండేళ్ల నుంచి పరారీలో ఉన్నా పట్టించుకోలేదు. ప్రసాదం కౌంటరు విభాగంలో ఏడుకొండలు తన బంధువును అనధికారికంగా నియమించారు.

ప్రధాన స్టోర్సులో నిల్వలకు, దస్త్రాలకు సంబంధం లేదు. జమ్మిదొడ్డి ప్రధాన కార్యాలయంలో టెండర్ల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. టెండర్లు లేకుండానే సంగం డెయిరీ నుంచి ఆవు నెయ్యి భారీగా కొన్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో టెండర్ల నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలింది. మ్యాక్స్‌ డిటెక్టివ్‌ అండ్‌ సెక్యూరిటీ సర్వీసుకు వర్క్‌ ఆర్డర్‌ ఇవ్వడంలో ఈవో నిబంధనలు ఉల్లంఘించినట్లు నివేదికలో పేర్కొన్నారు. మూడు సింహాల మాయం కేసులో భద్రతా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలింది. సెక్యూరిటీ సర్వీసు టెండర్లతో ప్రమేయం ఉన్న ఉద్యోగులందరినీ సస్పెండ్‌ చేయాలని దేవదాయశాఖ కమిషనర్‌ ఆదేశాలు ఇచ్చారు. దీనిప్రకారం ఈవోపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

మంత్రి వెలంపల్లిని తొలగించాలి: ఎంపీ నాని

విజయవాడ (చిట్టినగర్‌), న్యూస్‌టుడే: దుర్గగుడిలో ఏసీబీ తనిఖీల నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావును వెంటనే పదవి నుంచి తొలగించాలని విజయవాడ ఎంపీ కేశినేని నాని డిమాండ్‌ చేశారు. విజయవాడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ.. అధికారులు, ఉద్యోగులు, కిందిస్థాయి సిబ్బందిపై వేటు పడిందని, నిజంగా దోచుకున్నది వారు కాదని, మంత్రేనని ఆరోపించారు. దుర్గమ్మ హుండీ కంటే మంత్రి హుండీ ఎక్కువగా నింపుకొంటున్నారని విమర్శించారు. ఈవో సురేష్‌బాబును సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి:

పాఠశాలల్లో ‘నాడు-నేడు’ పనుల పూర్తిలో జాప్యం

Last Updated : Feb 24, 2021, 3:26 AM IST

For All Latest Updates

TAGGED:

acb taza
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.