ETV Bharat / city

Water Tax: నీటి పన్ను.. 'ఆ నెల నాటికి వంద శాతం వసూలు చేయాల్సిందే' - ap updates

water tax : నీటి పన్ను వసూళ్లను మార్చి నాటికి వందకు వంద శాతం పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చెల్లించని వారి వివరాలను సర్వే నంబర్ల ఆధారంగా అధికారులు ఆన్‌లైనులో మ్యాపింగ్‌ చేస్తున్నారు. ఎకరానికి ఖరీఫ్‌లో రూ.200, రబీలో రూ.150 చొప్పున నీటి తీరువా కింద రైతులు చెల్లించాలి.

water tax
water tax
author img

By

Published : Feb 22, 2022, 7:20 AM IST

Water Tax: ‘నీటి తీరువా (నీటి పన్ను) వసూళ్లను మార్చి నాటికి వందకు వంద శాతం పూర్తి చేయాలి. గ్రామ, మండల, జిల్లా స్థాయి బృందాల ద్వారా ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగాలి’ అని ప్రభుత్వం నుంచి జిల్లాలకు ఆదేశాలు జారీ అయ్యాయి. వీటికి అనుగుణంగా జిల్లాల్లో సమీక్షలు, వసూళ్లకు కార్యాచరణ సిద్ధమవుతోంది. నీటి తీరువా చెల్లించని వారి వివరాలను సర్వే నంబర్ల ఆధారంగా ఆన్‌లైనులో మ్యాపింగ్‌ చేస్తున్నారు. ఎకరానికి ఖరీఫ్‌లో రూ.200, రబీలో రూ.150 చొప్పున నీటి తీరువా కింద రైతులు చెల్లించాలి. వీటిని నవంబరు/డిసెంబరు, మార్చి/ఏప్రిల్‌లో వసూలు చేస్తుంటారు. వివిధ కారణాలతో రైతుల్లో కొందరు కొన్నేళ్ళుగా నీటి తీరువా చెల్లించడం లేదు. ఇలాంటి వారి నుంచి ఇప్పటికే అమలులో ఉన్న నిబంధన ప్రకారం ఏడాదికి 6శాతం జరిమానా వసూలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో చిన్న రైతులు చెల్లించాల్సిన మొత్తం కంటే వడ్డీ ఎక్కువగా ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఆందోళనలో రైతులు..

ఈ పరిణామాలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. కృష్ణా జిల్లాలో 3.45 లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం కృష్ణా జిల్లాలో రైతుల నుంచి రూ.168 కోట్లు వసూలు కావాల్సి ఉందని అంచనా. విజయవాడ డివిజన్‌ పరిధిలో ఈ మొత్తం రూ.120 కోట్ల వరకు ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. విశాఖ జిల్లాలోని తాండవ జలాశయం పరిధిలో రెండేళ్ల క్రితం రూ.40 లక్షల మేర వసూలు చేశారు. గుంటూరు జిల్లాలోని ఓ మండలంలో 19వేల మంది రైతుల నుంచి సుమారు రూ.1.5 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ఈ గణాంకాలతో బకాయిల జాబితాలు తయారవుతున్నాయి. మొత్తం 13 జిల్లాల్లో కలిపి నీటి తీరువా కింద రూ.650 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు జమ అవుతాయని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇదీ చదవండి :

govt employees Salaries : ప్రభుత్వ ఉద్యోగులకు అనామతు ఖాతా నుంచి జీతాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.