ఈ నెల 26న విజయవాడలో తొలి రాష్ట్ర కమిటీ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ తెలిపారు. నూతనంగా ఎంపిక చేసిన 11 మంది ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, 18 జిల్లాల అధ్యక్షులతో పాటు సమన్వయ కమిటీ సభ్యులు హాజరవుతారని హైదరాబాద్ లోని ఇందిరా భవన్లో చెప్పారు. యువతకు, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు సామాజిక న్యాయం పాటించనున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ కోసం నిరంతరం కృషి చేసేవారిని గుర్తించి... ఇంకా మిగిలిన ఉన్న పోస్టుల నియమాకాలు చేపట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అధికార పార్టీ ప్రజా సంక్షేమానికి దూరంగా పని చేస్తోందని... నిలదీయవాల్సిన ప్రతిపక్షం పూర్తిగా విఫలమైందని శైలజానాథ్ విమర్శించారు.
ఇవీ చదవండి: