కరోనా ఉద్ధృతి దృష్ట్యా పదో తరగతి పరీక్షలు రద్దు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. ఎస్సెస్సీ బోర్డు నిర్ణయించే ఆబ్జెక్టివ్ విధానం ఆధారంగా ఫలితాలు ఇవ్వనుంది. ఫలితాలు ఎవరికైనా సంతృప్తి లేకపోతే పరీక్షలకు అవకాశం కల్పించనుంది.
పరిస్థితులు మెరుగయ్యాక పరీక్షలకు అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం పేర్కొంది. తెలంగాణలో ఇంటర్ పరీక్షలు కూడా వాయిదా పడే అవకాశముంది. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. కరోనా విజృంభణతో సీబీఎస్సీ తరహాలోనే పరీక్షలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఈ మేరకు ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు సంబంధిత దస్త్రం చేరినట్లు సమాచారం. ఇంటర్మీడియట్ పరీక్షలను వాయిదా వేయాలని విద్యాశాఖ ప్రతిపాదించింది. ముఖ్యమంత్రి ఆమోదం అనంతరం ఇంటర్ పరీక్షల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకటించనుంది.
ఇదీ చదవండి: 'జగన్ బెయిల్ రద్దు' పిటిషన్‌పై.. ఈ నెల 22న సీబీఐ కోర్టు విచారణ!