కష్టమొచ్చినా, సుఖమొచ్చినా తలిచేది దేవుడ్నే. బాధలు చెప్పుకునేందుకు, మొక్కులు చెల్లించుకునేందుకు నిత్యం ఆలయాల(temples) చుట్టూ ప్రదక్షిణలు చేసే భక్తులెందరో. అలాంటివారి భక్తికి కరోనా బ్రేక్ వేసింది. చాలాచోట్ల ఆలయాలు మూతపడటం లేదా పరిమిత సంఖ్యలోనే భక్తుల(devotees)ను అనుమతించడం వల్ల.. అధికశాతం మంది ఆలయంలో ఉండే భక్తి భావనకు, ప్రశాంతతకు దూరమవుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకున్న దేవదాయశాఖ ఇంటి నుంచే పూజల పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది.
ఆలయాల సేవలన్నింటినీ ఆన్‌లైన్(online) ద్వారా ప్రత్యక్షప్రసారం చేస్తూ.. భక్తులు పరోక్షంగా పాల్గొనేలా దేవదాయశాఖ ఏర్పాట్లు చేసింది. అన్నవరం, ఇంద్రకీలాద్రి, సింహాచలం, ద్వారకాతిరుమల, కాణిపాకం లాంటి ప్రధాన ఆలయాలకు విశేష ఆదరణ లభిస్తోంది. ఏప్రిల్ నుంచే ఇంటి నుంచి పూజను తీసుకొచ్చినా.. గత నెల నుంచి మంచి స్పందన లభిస్తోందని అధికారులు అంటున్నారు. భక్తులు ఆలయాలకు రాకున్నా.. కోటి రూపాయలకుపైగా సేవా రుసుము, 20లక్షల 'ఈ-హుండీ' విరాళాలు వచ్చినట్టు చెబుతున్నారు.
కేవలం కరోనా ముగిసేవరకే కాకుండా.. భవిష్యత్‌లోనూ ఆన్‌లైన్ ద్వారా పరోక్ష సేవలను కొనసాగిస్తామని ఉన్నతాధికారులు అంటున్నారు. విదేశీ భక్తులు విరాళాలిచ్చేందుకు.. ఆయా దేశాల్లో దేవతామూర్తుల విగ్రహాల ఏర్పాటు, పూజా విధానాలపై అవగాహన కల్పించేందుకు త్వరలోనే ప్రత్యేక సెల్ ఏర్పాటుకు నిర్ణయించారు.
ఇదీ చదవండి: