వైద్యుడు సుధాకర్ విషయాన్ని ఇంకా మర్చిపోక ముందే.... మరో ఎస్సీ డాక్టర్ అనితారాణి పై ప్రభుత్వం దాడి దుర్మార్గమని.... తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీల పట్ల వైకాపా అసలు రంగు బయటపడుతోందన్న ఆమె...దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు.
అమెరికాలో కోట్లు సంపాదించి పెట్టే ఉద్యోగాన్ని వదులుకుని గ్రామీణ ప్రాంత పేదలకు వైద్యం అందించాలని తపించడమే అనితారాణి చేసిన నేరమా అని నిలదీశారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్, మహిళా కమిషన్ ఉన్నా న్యాయం జరిగే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి