ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. తెలంగాణలోని వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన పి.పవన్ కృష్ణారెడ్డి 142కుపైగా మార్కులు సాధించి...99.96 పర్సంటైల్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లా కలకడ మండలం గంగాపురం గ్రామానికి చెందిన ధరూరి ఫణీత్ 99.85 పర్సంటైల్ సాధించాడు. ఏపీ, తెలంగాణలో 96కిపైగా పర్సంటైల్ పొందినవారు 50 మంది వరకు ఉండొచ్చని అంచనా. వారందరికీ ఐఐఎంలలో సీట్లు కచ్చితంగా దక్కుతాయని నిపుణులు చెబుతున్నారు. కేవలం పరీక్ష స్కోర్ కాకుండా ఆప్టిట్యూడ్ పరీక్ష, ముఖాముఖీ, బృంద చర్చలో ప్రతిభ ఆధారంగా ఐఐఎంలు అభ్యర్థులకు సీట్లు ఇస్తాయి.
విద్యార్థులతో పాటు... ఉద్యోగులు కూడా
ఈ పరీక్ష రాసే వారిలో అధిక శాతం మంది ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఇతర ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలల్లో బీటెక్ చదువుతున్న, చదివిన విద్యార్థులే. ఫలితాల్లో ఉత్తమ పర్సంటైల్ సాధిస్తున్నవారిలో మాత్రం ఎక్కువ మంది ఒకటి నుంచి మూడేళ్ల క్రితమే బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం ఏదో ఒక ఉద్యోగం చేస్తున్న వారే కావడం గమనార్హం.
స్టార్టప్ పెట్టాలనుకుంటున్నా
తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నా. నాతో పాటు పలువురికి ఉపాధి కల్పించాలన్నది నా ఆలోచన. ఎంబీఏ చేసి స్టార్టప్ ప్రారంభించాలనుకుంటున్నా. మాది వ్యవసాయ కుటుంబం.
- ధరూరి ఫణీత్, 99.85 పర్సంటైల్
మేనేజ్‌మెంట్ రంగం వైపు వెళ్లాలని...
హైదరాబాద్‌లోనే 2017 మే నెలలో బీటెక్ (ఐటీ) పూర్తి చేశాను. అప్పటి నుంచి హైదరాబాద్ డెలాయిట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా. అయితే నా చదువుకు, చేసే ఉద్యోగానికి సంబంధం లేదని అనిపించింది. ఈ ఉద్యోగం ఎవరైనా చేయొచ్చు. ఈ క్రమంలోనే మేనేజ్‌మెంట్ వైపు వెళ్లాలని, నైపుణ్యాలు పెంచుకొని ఉన్నత స్థానానికి వెళ్లాలని భావించాను. ఐఐఎం కోల్‌కతా నుంచి ముఖాముఖికి పిలుపు రావొచ్చని అంచనా వేస్తున్నా.
- సౌజన్య, 99.03 పర్సంటైల్
ఇదీ చదవండి: