AUSTRALIAN ACADEMY OF SCIENCE PRESIDENT: తెలుగు శాస్త్రవేత్త అరుదైన ఘనత.. ఆస్ట్రేలియా అత్యున్నత పదవికి ఎంపిక - అత్యున్నత పదవికి తెలుగు వ్యక్తి ఎంపిక
దేశంలో శాస్త్ర సాంకేతిక పరిశోధనలు.. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహంపైనే ఆధారపడి ఉంటాయని సీనియర్ శాస్త్రవేత్త చెన్నుపాటి జగదీశ్ అన్నారు. ఆస్ట్రేలియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అధ్యక్షుడిగా (Chennupati Jagadish elected as a Australian Academy of Sciences President) ఎంపికైన చెన్నుపాటి జగదీశ్.. "జూమ్" ద్వారా పలు ఆసక్తికర విషయాలను "ఈటీవీ భారత్"తో పంచుకున్నారు. ఆస్ట్రేలియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అధ్యక్షునిగా రెండు దేశాల మధ్య శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రోత్సాహకానికి, భాగస్వామ్యానికి తనవంతు కృషి చేస్తానన్నారు. కృష్ణా జిల్లాలోని ఓ మారుమూల గ్రామం నుంచి ఆస్ట్రేలియాలో అత్యున్నత స్థానానికి ఎదిగిన ఆయన విజయ ప్రస్థానం గురించి ఆయన మాటల్లోనే...