ETV Bharat / city

రూటు మార్చిన అక్రమార్కులు.. పార్శిల్ సర్వీస్ ద్వారా మద్యం రవాణా - ఏపీలో తెలంగాణ మద్యం అక్రమ రవాణా

మద్యం అక్రమ రవాణాకు రూటు మార్చారు అక్రమార్కులు. పార్శిల్ సర్వీస్ ద్వారా తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం రవాణా చేస్తున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన ఎక్సైజ్ అధికారులు విజయవాడలోని ఓ పార్శిల్ కార్యాలయంలో తనిఖీలు చేశారు. మద్యం సీసాలను గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

రూటు మార్చిన అక్రమార్కులు.. పార్శిల్ సర్వీస్ ద్వారా మద్యం రవాణా

author img

By

Published : Aug 13, 2020, 11:49 PM IST

మద్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు, ఎక్సైజ్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేస్తుండడంతో... అక్రమార్కులు రూటు మార్చారు. కొరియర్ సర్వీసు ద్వారా మద్యం రవాణా మార్గం ఎంచుకున్నారు. పక్కా సమాచారంతో విజయవాడ హనుమాన్ పేట్ లోని సలీం పార్సిల్ కార్యాలయంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు.

ఓ పార్సిల్ లో 48 మద్యం సీసాలు ఉన్నట్లు గుర్తించారు. తెలంగాణ నుంచి విజయవాడకు కొరియర్ ద్వారా మద్యం రవాణా చేస్తున్నట్లు తేల్చారు. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి:

108 సిబ్బంది మానవత్వం.. కరోనా బాధితురాలికి ప్రసవం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.