ETV Bharat / city

సరిహద్దుల వద్ద అంబులెన్స్​లను అడ్డుకుంటున్న తెలంగాణ పోలీసులు

author img

By

Published : May 14, 2021, 7:03 PM IST

తెలంగాణలోకి వెళ్లేందుకు ఆ రాష్ట్ర అనుమతి తప్పనిసరి అన్న.. సూర్యాపేట ఎస్పీ ఆదేశాలను పోలీసులు పక్కాగా అమలుచేస్తున్నారు. వ్యక్తిగత వాహనాలతో పాటు అంబులెన్స్​లను సైతం అడ్డుకుంటున్నారు. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఆథరైజేషన్ పాస్, ఆస్పత్రి అపాయింట్​మెంట్ లేకుంటే రావద్దని స్పష్టం చేశారు.

ambulances stoppage continue at garikapadu
గరికపాడు వద్ద అంబులెన్స్​లను అడ్డుకుంటున్న తెలంగాణ పోలీసులు
అంబులెన్స్​లను అడ్డుకుంటున్న తెలంగాణ పోలీసులు

కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్​పోస్ట్ వద్ద అనుమతిలేని అంబులెన్సులను తెలంగాణ పోలీసులు వెనక్కి పంపుతున్నారు. కొవిడ్ చికిత్సకు రోగులను తీసుకువచ్చే అంబులెన్సులు, వ్యక్తిగత వాహనాలకు.. అనుమతి తప్పనిసరి అన్న నిబంధన సరిహద్దుల్లో సమస్యాత్మకంగా మారింది.

ఇదీ చదవండి: తీవ్ర విషాదంలో పన్నీర్​సెల్వం కుటుంబం

ఆస్పత్రి అపాయింట్​మెంట్​తో పాటు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఆథరైజేషన్ పాస్ తప్పనిసరి అని.. సూర్యాపేట ఎస్పీ ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేస్తున్నారు. వాటిలో ఏదో ఒకటి ఉంటే సరిపోదని.. రెండూ ఖచ్చితంగా ఉండాల్సిందేనని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని అనుమతి పత్రాలు పొందిన తర్వాతే.. చికిత్సకు బయలుదేరాలని సూచించారు. లేకుంటే సరిహద్దుల వద్ద ఇబ్బందులు తప్పదని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

అంబులెన్సులు ఆపే హక్కు ఎవరిచ్చారు?: టీఎస్ హైకోర్టు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.