ETV Bharat / city

ముఖ ఆధారిత హాజరుపై మంత్రితో చర్చలు.. అంతా మంచి కోసమేనన్న బొత్స - ఫేస్‌ యాప్‌ హాజరు

Minister Botsa Meeting With Teachers : ముఖ ఆధారిత యాప్ ఫోన్లలో డౌన్ లోడ్ చేసుకునేందుకు.. ఉపాధ్యాయ సంఘాల నేతలు అంగీకరించారు. ఈమేరకు యాప్‌ ద్వారా హాజరు నమోదుపై మంత్రి బొత్స సత్యనారాయణతో జరిపిన చర్చలు ఫలించాయి. అయితే.. యాప్‌లో సాంకేతిక సమస్యలు అధిగమించేందుకు 15 రోజుల గడువు కోరారు. విద్యాభివృద్ధికి చర్యలు చేపట్టామన్న మంత్రి బొత్స.. 670 ఎంఈఓ పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ముఖ ఆధారిత యాప్ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని చెప్పారు. తమది ఫ్రెండ్లీ ప్రభుత్వమని బొత్స వ్యాఖ్యానించారు.

BOTSA SATYANARAYANA
BOTSA SATYANARAYANA
author img

By

Published : Sep 1, 2022, 9:21 PM IST

BOTSA SATYANARAYANA : ఉపాధ్యాయ సంఘ నేతలతో నేడు రెండు అంశాలపై సమావేశం జరిగిందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. 670 ఎంఈఓ పోస్టులు భర్తీ చేయాలని సీఎం చెప్పారని పేర్కొన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం పెండింగ్​లో ఉన్న 248 ప్రభుత్వ టీచర్లను సీనియారిటీ ఆధారంగా మండలానికి ఎంఈఓలుగా నియమిస్తామని వెల్లడించారు.

ముఖ ఆధారిత యాప్​పై వస్తున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలనేదే ముఖ్యమంత్రి భావన అని తెలిపారు. తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని అన్నారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. టీచర్ల​పై పెట్టిన కేసుల విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని స్పష్టం చేశారు.

"ఉద్యోగసంఘాల నేతలతో రెండు అంశాలపై చర్చించాం. ఫేస్‌ యాప్‌ హాజరుపై వస్తున్న సమస్యలను త్వరగా పరిష్కరిస్తాం. మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ గవర్నమెంట్. ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తెస్తే తప్పకుండా పరిష్కరిస్తాం. టీచర్లపై పెట్టిన కేసుల అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తాం. ఇవాళ 86 శాతం మంది యాప్‌లో హాజరు నమోదు చేశారు. సర్వీస్ రూల్స్‌లో ఉన్నవాటినే అమలుచేస్తున్నాం. ఉపాధ్యాయులు, విద్యార్థులకు మంచి చేయాలనేదే మా తపన." -బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి

ఈరోజు 86 శాతం మంది టీచర్స్ యాప్​లో హాజరు నమోదు చేసుకున్నారని మంత్రి బొత్స పేర్కొన్నారు. సర్వీస్ రూల్స్​లో ఉన్న వాటిని అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. తమకు ఇగో లేదని కేవలం టీచర్లు, విద్యార్థులకు మంచి చేయాలనే తపన మాత్రమే ఉందన్నారు. సీపీఎస్ సమస్యపై రెండు, మూడు రోజుల్లో ఉద్యోగులతో మాట్లాడతామని పేర్కొన్నారు. కొత్తగా 38 డిప్యూటీ డీఈఓ పోస్టులను భర్తీ చేస్తున్నామని వెల్లడించారు.

ఎస్​టీయూ రాష్ట్ర అధ్యక్షుడు: తమ ఫోన్లల్లోనే ముఖ ఆధారిత హాజరు యాప్ డౌన్​లోడ్ చేసుకునేందుకు ప్రభుత్వం అంగీకరించినట్లు ఎస్​టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయి శ్రీనివాస్ తెలిపారు. ముఖ ఆధారిత యాప్ హాజరులో ఉన్న సాంకేతిక సమస్యలు పరిశీలించేందుకు 15 రోజుల సమయం కోరామని వెల్లడించారు. సాంకేతిక ఇబ్బందులు తొలగించిన తర్వాతే.. పూర్తి స్థాయిలో అమలు చేయాలని సూచించామన్నారు. ఉమ్మడి సర్వీస్ నిబంధనలు న్యాయస్థాన పరిధిలో ఉన్నందున 248 ఎంఈఓ పోస్టులను ప్రభుత్వ టీచర్లతో ఎఫ్ఏసీలుగా భర్తీ చేయబోతున్నారని పేర్కొన్నారు. 672 ఎంఈఓ పోస్టులను జెడ్పీ టీచర్లతో ఎఫ్ఏసీలుగా భర్తీ చేయనున్నారు. ఫేస్ రిక్నగేషన్ యాప్ మా ఫోన్లల్లోనే డౌన్ లోడ్ చేసుకోవాలని మంత్రి సూచించారన్నారు. టైమ్ ప్రకారం అటెండెన్స్ వేసినా.. అప్​లోడింగులో సమస్య ఉంటే.. దాన్ని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారన్నారు.

ముఖ ఆధారిత హాజరుపై చర్చలు సఫలం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.