తామెప్పుడూ తెదేపాకు అండగానే ఉంటామని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెదేపా ఆర్య వైశ్య సామాజికవర్గ నాయకులు స్పష్టం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తుండటంతో... వైకాపాలో చేరుతున్నట్లు ఆ పార్టీ నేతలు పుకార్లు సృష్టిస్తున్నారని ఆక్షేపించారు. తెదేపాకు అండగా స్థానిక మాజీ శాసనసభ్యులు బొండా ఉమకి అండగా ఉంటామని ఉద్ఘాటించారు. రాబోయే ఎన్నికల్లో కష్టపడి పనిచేసి తెదేపా గెలుపునకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: