పది, ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల పట్ల ముఖ్యమంత్రి జగన్కు ఎందుకంత పగని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య నిలదీశారు. పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ మంత్రి ఆచరణ సాధ్యం కాని ప్రకటనలు ఇస్తున్నారని మండిపడ్డారు. పరీక్షల వల్ల ఏ బిడ్డకేం జరిగినా ముఖ్యమంత్రిదే బాధ్యత అని హెచ్చరించారు. కరోనాతో చనిపోతున్న వారికి ముఖ్యమంత్రి ఫోటోతో మరణ ధృవీకరణ పత్రాలు ఇవ్వగలరా అని ప్రశ్నించారు.
ఇదీచదవండి
విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కరోనా సోకదా..?: నారా లోకేశ్