కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు (New Agriculture Bills) వ్యతిరేకంగా ఈ నెల 27న రైతు సంఘాలు చేపట్టిన భారత్ బంద్‌కు (Bharat Bandh) సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు (Atchennaidu) వెల్లడించారు. రైతుల ప్రయోజనాలే తెదేపాకి (TDP) ప్రధానమని ఆయన స్పష్టం చేశారు. తెదేపా కార్యకర్తలు, నాయకలు బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని అచ్చెన్నాయుడు సూచించారు. రైతు వ్యతిరేక చట్టాలపై కేంద్రం పునరాలోచించాలని తమ ఎంపీలు పార్లమెంట్లో (Parlament) గళం విప్పారని గుర్తు చేశారు.
సచివాలయాలను సందర్శిస్తానంటున్న సీఎం జగన్.. అంతకంటే ముందు రైతులతో సమావేశం కావాలని అచ్చెన్న డిమాండ్ చేశారు. అప్పుల కోసం మోటార్లకు మీటర్లు పెట్టి రైతుల మెడకు ఉరితాడు బిగిస్తున్నారని ఆరోపించారు. సూక్ష్మసేధ్యం (Drip Irrigation) రద్దు చేయడంతో మెట్టప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రైతు భరోసా పథకం (Rythu Bharosa) కింద రూ. 12,500 వేలు ఇస్తామని చెప్పి..రూ.7,500 మాత్రమే ఇస్తున్నారని అచ్చెన్నాయుడు ఆక్షేపించారు.
ఇదీ చదవండి
Bharat bandh: ఈ నెల 27న భారత్ బంద్‌కు ఏపీ లారీ ఓనర్స్ అసోషియేషన్ మద్దతు