తాము వేసుకుంది జగన్ చొక్కాలు కాదు.. ఖాకీ చొక్కాలనే విషయం పోలీసులు గ్రహించాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. వైకాపా కార్యకర్తల ఆగడాలకు మించి పోలీసులు దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు.
"దిశ పోలీస్ స్టేషన్ల ముందు నిరసనకు దిగిన తెలుగు మహిళ, తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ నేతల అక్రమ అరెస్టును ఖండిస్తున్నా. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబుపై పోలీసులు చేయి చేసుకోవటం దుర్మార్గం. బీసీ నేతల్ని తాడేపల్లి ఆదేశాలతోనే అణచాలని చూస్తున్నారు. అత్యాచార నిందితుల్ని కొట్టేందుకు లేవని చేతులు.. బాధితుల తరఫున పోరాడేవారిని కొట్టి ఏం సందేశమిస్తున్నారు. నిందితులకు భరోసా ఇస్తున్నట్లుగా పోరాడే వారిని బెదిరిస్తున్నారు. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని కాదని రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తే భవిష్యత్లో భంగపాటు తప్పదు."-అచ్చెన్నాయుడు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు
ఇదీ చదవండి