ETV Bharat / city

అవి వైకాపా నేతల ఏటీఎం సెంటర్లు - Rythu Bharosa Kendralu

Atchannaidu రైత భరోసా కేంద్రాల్లో అక్రమాలు జరుగుతున్నాయని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వైకాపా ధ్వజమెత్తారు. రైతు భరోసా కేంద్రాలు అధికార పార్టీ నేతలకోసమే ఉన్నాయని విమర్శించారు. ధరల స్థిరీకరణ పేరుతో రైతులను వైకాపా మోసం చేసిందని మండిపడ్డారు.

Atchannaidu
అచ్చెన్నాయుడు
author img

By

Published : Aug 17, 2022, 5:31 PM IST

Atchannaidu రైతు భరోసా కేంద్రాలు వైకాపా నేతలకు ఏటీఎంగా మారాయని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఆర్బీకేలు రైతుల నుండి సరిగా ధాన్యం కొనట్లేదని, కొద్దో గొప్పో కొన్నా.. రైతుకు వెంటనే డబ్బు చెల్లించట్లేదని ఆరోపించారు. "ఎరువులు అధిక ధరలకు అమ్ముతున్నారు. రైతులకు ఎరువులపై స్వల్పకాలిక రుణం కూడా లేదు. పోనీ.. కావాల్సిన ఎరువులన్నీ ఆర్బీకేల్లో దొరుకుతాయా అంటే అదీ లేదు." అని మండిపడ్డారు. ఆర్బీకే భవనాలకు అద్దెలు కూడా సరిగా చెల్లించట్లేదని, ధాన్యం బస్తాపై 200 వరకూ కమీషన్ గుంజుతున్నారని ఆరోపించారు. అసలు రాష్ట్రవ్యాప్తంగా రైతులకు అవసరమైన ఎరువుల మొత్తం ఎంత? ఆర్బీకేల వద్ద ఎంత శాతం ఉన్నాయి? రైతులకు ఎంత సరఫరా చేశారు? అన్న లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇక, ధాన్యం కొనుగోళ్ల తీరుపైనా అచ్చెన్న మండిపడ్డారు. అధికారులు, వైకాపా నాయకులు కుమ్మక్కై నకిలీ రైతుల పేర్లతో ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. ఒక్క రబీలోనే వందల కోట్ల సొమ్ము కాజేశారని ఆరోపించారు. మొత్తం కొనుగోళ్ల లెక్కలు తీస్తే.. ఎన్ని వేల కోట్లు కాజేశారో తేలుతుందని అన్నారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి.. రాష్ట్రవ్యాప్తంగా పండించిన పంట ఎంత? అందులో ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం ఎంత? రైతులకు బకాయి పెట్టిన సొమ్ము ఎంత? అన్న వివరాలు సైతం బయటపెట్టాలన్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్‌ చేశారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.