ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు విసిరిన సవాల్‌కు విజయసాయిరెడ్డి స్పందించాలని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాశ్ డిమాండ్ చేశారు. ఏ తప్పూ చేయకుండానే 16 నెలలు జైల్లో ఉన్నామని జగన్, విజయసాయి ప్రమాణం చేయగలరా? అని ప్రశ్నించారు. వైకాపా ఆవిర్భావంతో రాజకీయాల్లో నైతిక విలువలు సమాధి అయ్యాయని విమర్శించారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి కత్తులతో వెళ్లి కూడా తాను కత్తులతో వెళ్లినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని పెద్దారెడ్డి అంటున్నారని, ఆధారాలు బయటపడే సరికి మాట మార్చారని మండిపడ్డారు. 18 నెలలుగా రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని... కుల, మత, ప్రాంత భేదం లేకుండా పాలన చేస్తానని అసెంబ్లీ సాక్షిగా ప్రమాణం చేసిన జగన్.. రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు.
ఇదీ చదవండి: