తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభిని పోలీసులు కృష్ణా జిల్లా తోట్లవల్లూరు పీఎస్ నుంచి విజయవాడకు తరలించారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించే అవకాశముంది. అనంతరం పట్టాభిని కోర్టుకు తీసుకెళ్లనున్నారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు..
తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ వద్ద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొమ్మరెడ్డి పట్టాభిని తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ నుంచి భారీ బందోబస్తు నడుమ విజయవాడ తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేయగా.. తెదేపా నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు బందోబస్తు నడుమ పట్టాభిని తోట్లవల్లూరు నుంచి విజయవాడకు తరలించారు. తెదేపా కార్యకర్తలు కాన్వాయ్ వెంట పరుగులు పెట్టారు. పోలీసులు రోప్ ద్వారా కాన్వాయ్‌ను ముందుకు తీసుకువెళ్లారు. పట్టాభిని తీసుకెళుతున్న వాహనాన్ని తెదేపా శ్రేణులు ద్విచక్ర వాహనాలపై అనుసరించాయి.
ఇదీ చదవండి:PATTABHI RAM : నేడు కోర్టు ముందుకు పట్టాభి