ETV Bharat / city

మద్యం మాఫియాపై.. తెదేపా ప్రత్యేక వెబ్‌సైట్‌..!

www.killerjbrands.com: మద్యం మాఫియాపై ప్రత్యేక వెబ్‌సైట్​ను రూపొందించినట్లు తెలుగుదేశం పార్టీ వెల్లడించింది. మద్యం పేరుతో దోపిడీ, మరణాల వివరాలు వెబ్‌సైట్‌లో ఉంచుతామని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. ఈ డిజిటల్ క్యాంపెయిన్‌లో ప్రజలు భాగస్వాములు కావాలని నేతలు కోరారు.

మద్యం మాఫియాపై తెదేపా ప్రత్యేక వెబ్‌సైట్‌

author img

By

Published : Mar 26, 2022, 3:43 PM IST

www.killerjbrands.com: ముఖ్యమంత్రి జగన్ నడిపిస్తున్న మద్యం మాఫియాపై జరిపే పోరాటంలో ప్రజలను భాగస్వామ్యం చేస్తామంటూ.. తెలుగుదేశం ప్రత్యేక వెబ్ సైట్ రూపొందించింది. ఏపీలో నాసిరకం మద్యం బ్రాండ్లు ప్రాణాలు తీస్తున్నాయంటూ.. తెదేపా డిజిటల్ క్యాంపెయినింగ్ మొదలు పెట్టింది. ప్రభుత్వ మద్యం పాలసీ, మద్యం పేరుతో జరుగుతోన్న దోపిడీ, మద్యం వల్ల సంభవిస్తున్న మరణాలు వంటి వివరాలను www.killerjbrands.com వెబ్​సైట్​లో పొందుపరుస్తామని తెదేపా నేతలు ఆనంద్‌బాబు, అశోక్‌బాబు, ఆచంట సునీత వెల్లడించారు.

దశల వారీ మద్య నిషేధం హామీని జగన్ గాల్లో కలిపేశారని తెదేపా నేతలు దుయ్యబట్టారు. మద్యం తయారీ మొదలుకుని అమ్మకాల వరకు ప్రభుత్వమే నడుపుతోందని ఆరోపించారు. జే-బ్రాండ్ల ద్వారా సరఫరా అయ్యే మద్యం ప్రాణాంతకంగా ఉందని మండిపడ్డారు. నాసిరకం మద్యంతో పేద మహిళల తాళిబొట్లు తెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిజిటల్ క్యాంపెయినింగ్​లో భాగస్వాములు కావాలని ప్రజలను కోరారు. మధ్యం మాఫియాపై ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని నేతలు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి :
మంత్రి మండలి పునర్‌వ్యవస్థీకరణపై అప్పటివరకు చర్చ లేనట్లే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.