రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. తెదేపా రెబెల్ ఎమ్మెల్యేలు కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాల గిరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 173 ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెదేపా రెబెల్ ఎమ్మెల్యేలు ఎవరికి ఓటేశారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. కరణం బలరాం పోలింగ్ ముగియడానికి 25 నిమిషాల ముందు పోలింగ్ కేంద్రానికి వచ్చారు.
గెలవమని తెలిసే వర్ల రామయ్యకు రాజ్యసభ టిక్కెట్ ఇచ్చారని తెదేపా రెబెల్ ఎమ్మెల్యే మద్దాలగిరి ఆరోపించారు. గెలిచే సమయంలో వర్ల రామయ్య తెదేపాకి గుర్తుకు రాలేదా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసింది చంద్రబాబేనని విమర్శించారు. విప్ తనకు అందలేదని పార్టీ నిర్ణయం మేరకే ఓటేశానని మద్దాల గిరి తెలిపారు.
రాజ్యసభ ఎన్నికలకు కారణం చంద్రబాబే..
గతంలో తెదేపా తులాభారం వేసి టిక్కెట్లు ఇచ్చిందని మరో తెదేపా రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలిపారు. కరోనా సమయంలో పదో తరగతి పరీక్షలు ఎందుకన్న చంద్రబాబే... ఈ సమయంలో రాజ్యసభ ఎన్నికలకు కారణమని వంశీ విమర్శించారు. చంద్రబాబు శిబిరం ఖాళీ కాబోతుందన్నారు. ఇంత చేస్తే తెదేపాకి పడిన ఓట్లు 17 అన్న వంశీ... తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేసి మళ్లీ ఓటేయమనడం ఏంటని ప్రశ్నించారు. సభాపతి తనను ప్రత్యేక సభ్యునిగా గుర్తించారని వంశీ తెలిపారు.
ఇవీ చదవండి: 'కేసులున్న వారికా...? లేని వారికా..? వైకాపా ఎమ్మెల్యేలే నిర్ణయించుకోండి?'