ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా.. గిరిజనులకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. పోలవరం నిర్వాసిత ఆదివాసీలకు పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిహారం చెల్లించకుండా బలవంతంగా ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారని ఆవేదన చెందారు. విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలను ప్రోత్సహిస్తూ గిరిజనుల భవిష్యత్‌ను కాలరాస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
ఈ అంశాలపై గిరిజన సంఘాలు ఫిర్యాదు చేసినా.. ఎన్జీటీ వద్దన్నా.. వైకాపా చేస్తున్న మైనింగ్‌కు అడ్డుకట్ట పడటం లేదని చంద్రబాబు విమర్శించారు. గిరిజనుల సంక్షేమం, అభ్యున్నతి కోసం తెలుగుదేశం ప్రవేశపెట్టిన ఏ పథకమూ ఇప్పుడు అమలులో లేదన్నారు. గిరిజన రిజర్వేషన్ల జీవో-3 రద్దు పై ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహించారు. ఇప్పటికైనా మన్యంలో మైనింగ్ అక్రమాలను నిలిపివేయాలన్నారు. ఆగిపోయిన గిరిజన సంక్షేమ పథకాలను కొనసాగించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
ఏపీలో ఆర్థిక అత్యయిక స్థితి ప్రకటించాలి: రాష్ట్రపతికి ఎంపీ రఘురామ లేఖ