ETV Bharat / city

సంక్షేమ పాలనకు ఆద్యుడు ఎన్టీఆర్: చంద్రబాబు - ఎన్టీఆర్​కు నివాళులు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వార్తలు

ఎన్టీఆర్ 25వ వర్ధంతి సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు. రాజకీయాలకు నూతన నిర్వచనం ఇచ్చి, కోట్లాది జీవితాలలో వెలుగు నింపిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా ఎన్టీఆర్​కు నివాళులర్పించారు. సమ సమాజ స్థాపనే ఎన్టీఆర్ లక్ష్యమని ట్వీట్టర్ వేదికగా స్పష్టం చేశారు.

ఎన్టీఆర్ 25వ వర్ధంతికి తెదేపా అధినేత చంద్రబాబు నివాళి

author img

By

Published : Jan 18, 2021, 9:44 AM IST

Updated : Jan 18, 2021, 10:30 AM IST

రాజకీయాలకు నూతన నిర్వచనం ఇచ్చి, కోట్లాది జీవితాలలో వెలుగు నింపిన మహనీయుడు ఎన్టీఆర్ అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు కొనియాడారు. బడుగు బలహీనవర్గాల వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన సమతావాదని అన్నారు. పేదలకు ఆహారభద్రత, నివాస భద్రత, కట్టుకోవడానికి మంచి వస్త్రం అందించిన సంక్షేమ పాలనకు ఆద్యుడని చంద్రబాబు అన్నారు.

  • రాజకీయాలకు నూతన నిర్వచనం ఇచ్చి, కోట్లాది జీవితాలలో వెలుగు నింపిన మహనీయుడు ఎన్టీఆర్. బడుగు బలహీనవర్గాల వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన సమతావాది ఎన్టీఆర్. పేదలకు ఆహారభద్రత, నివాస భద్రత, కట్టుకోడానికి మంచి వస్త్రం అందించిన సంక్షేమ పాలనకు ఆద్యుడు ఎన్టీఆర్.(1/2) pic.twitter.com/ZiJX14ZNhR

    — N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) January 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

తెలుగువారి ఆత్మగౌరవాన్ని, కీర్తిని ప్రపంచానికి చాటిన నందమూరి తారకరామారావు దూరమై 25 సంవత్సరాలు అయినా... ఆ విశ్వవిఖ్యాతుడు మన కళ్ళముందే కదలాడుతున్నట్టు ఉందన్నారు. తెలుగునాట రామరాజ్యాన్ని తిరిగి నెలకొల్పడమే ఎన్టీఆర్ కు మనం అందించే అసలైన నివాళని చంద్రబాబు పిలుపునిచ్చారు.

లోకేష్ నివాళులు..

సామాన్య రైతుబిడ్డగా పుట్టి.. వెండితెర దేవుడై వెలిగి.. మనిషి ఎదగడానికి పట్టుదల, కృషి ఉంటే చాలని ఎన్టీఆర్ నిరూపించారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. అరవై ఏళ్ళ వయసులో రాజకీయాల్లోకి వచ్చి సంచలన విజయాలతో, సంక్షేమ పాలనతో చరిత్ర సృష్టించి ఏదైనా సాధించడానికి వయసుతో పనిలేదని, చిత్తశుద్ధి ఉంటే చాలని నిరూపించారని కొనియాడారు.

  • మహిళలకు ఆస్తిహక్కు కల్పించినా, బడుగు బలహీన వర్గాలకు పాలనాధికారాలు అప్పచెప్పినా, పేదలకు వినూత్న సంక్షేమ పథకాలు అందించినా సమసమాజ స్థాపనే ఎన్టీఆర్ గారి లక్ష్యం.ఆయన కీర్తిశేషులై 25 ఏళ్ళు అయ్యాయంటే నమ్మశక్యంగా లేదు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆ మానవతావాది ఆశయసాధనకు పునరంకితమవుదాం(2/2)

    — Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) January 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మహిళలకు ఆస్తిహక్కు కల్పించినా, బడుగు బలహీన వర్గాలకు పాలనాధికారాలు అప్పచెప్పినా, పేదలకు వినూత్న సంక్షేమ పథకాలు అందించినా సమ సమాజ స్థాపనే ఎన్టీఆర్ లక్ష్యమని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ కీర్తిశేషులై 25 ఏళ్ళు అయ్యాయంటే నమ్మశక్యంగా లేదని, ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆ మానవతావాది ఆశయసాధనకు పునరంకితమవుదామని లోకేష్ పిలుపునిచ్చారు.

ఇవీ చూడండి:

నాగార్జునసాగర్​లో నీటి చౌర్యం... నిద్రావస్థలో యంత్రాంగం

Last Updated : Jan 18, 2021, 10:30 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.