వ్యాక్సినేషన్ విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కేస్తూ ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. సమాజహితం కోసం ఉచితంగా వైద్యం అందిస్తానన్న ఆనందయ్యను హింసించటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండో దశ కంటే మూడో దశ ఇంకా ఉద్ధృతంగా ఉండనుందన్న హెచ్చరికల నేపథ్యంలో... ప్రభుత్వం మౌలిక సదుపాయాల ఏర్పాటుపై దృష్టి సారించాలన్నారు. అవసరమైతే ట్రస్టు ద్వారా కూడా నిధులు సేకరిస్తామని తెలిపారు. కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యుడు లోకేశ్వరరావు చేసిన సూచనల వీడియోను మహానాడులో ప్రదర్శించారు. అందరికీ వ్యాక్సిన్ అందిచటంతో పాటు బ్లాక్ ఫంగస్ నివారణకు సదుపాయాలు పెంచాలని డిమాండ్ చేస్తూ తయారు చేసిన తీర్మానాన్ని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు.
ఇదీచదవండి.