Varla Ramaiah: జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో కాళీ అనే యువకుడి ఆత్మహత్యకు కారకుడైన.. సీఐ దుర్గాప్రసాద్‌పై వెంటనే చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరారు.
సీఐ దుర్గాప్రసాద్ వేధింపులే తమ కుమారుడి ఆత్మహత్యకు కారణమని బాధితుడి తల్లిదండ్రులతో పాటు స్థానికులు చెబుతున్నారని లేఖలో పేర్కొన్నారు. సీఐ దుర్గాప్రసాద్ అవినీతిపరుడని... ప్రస్తుత కేసులోనూ లంచం తీసుకున్నాడని పలు ఆరోపణలు వచ్చాయని తెలిపారు.
ఆత్మహత్యకు ప్రేరేపించడం, చిత్రహింసలకు గురిచేయడం, వ్యక్తిగత భాగాలకు తీవ్ర గాయాలు చేసినందుకు.. సీఐపై తగిన సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేయాలన్నారు.
ఇదీ చదవండి: Suicide: యువకుడి ఆత్మహత్య.. సీఐ కొట్టడం వల్లేనంటూ బంధువుల ఆందోళన