ETV Bharat / city

పార్లమెంటులో పోరాటం.. తెదేపా నిర్ణయం - పార్టీ నేతలో చంద్రబాబు మీటింగ్ న్యుస్

రాష్ట్ర ప్రభుత్వ అరాచకాలను పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని తెలుగుదేశం ఎంపీలు తెలిపారు. రాజధానిని మారుస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పని వైకాపా..ఇప్పుడు పరిపాలన వికేంద్రీకరణ పేరిట 3 రాజధానుల నాటకానికి తెరలేపిందని మండిపడ్డారు. శాంతియుత ఆందోళన చేస్తున్న అమరావతి రైతులపై నక్సలైట్లు, తీవ్రవాదులపై పెట్టే కేసులను పెడుతూ..వారిని ఇబ్బందులకు గురిచేస్తోందని ఆక్షేపించారు. సెక్షన్‌ 144, సెక్షన్‌ 30 అమలు అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. శాసన మండలి రద్దు , జాతీయ ఉపాధి హామీ నిధుల దుర్వినియోగంపైనా గళం వినిపిస్తామన్నారు.

tdp-parlimentary-party-meeting
tdp-parlimentary-tdp-parlimentary-party-meetingparty-meeting
author img

By

Published : Jan 29, 2020, 5:47 AM IST

ఈనెల 31 నుంచి పార్లమెంటు బడ్జెట్‌ సమవేశాలు ప్రారంభమవుతున్నందున...తెలుగుదేశం పార్టీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో పాటు ఇతర నాయకులతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన 9 ప్రధాన అంశాలపై ఈ సమావేశంలో కూలంకుషంగా చర్చించారు. రాజధాని అమరావతి మార్పు, 3 రాజధానుల ప్రకటన, రాష్ట్ర ప్రభుత్వ విధ్వంసకర చర్యలపై కేంద్రానికి ఫిర్యాదు చేయాలని ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

దిగజారిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, ఉపాధిహామీ నిధుల మంజూరు, నిలిచిపోయిన పోలవరం పనులతో పాటు.. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి కండిషనబుల్ బెయిల్ షరతులను ఉల్లంఘించి చేస్తున్న ప్రలోభాలు, రాస్తున్న లేఖలు, మీడియాపై ఆంక్షలు, అక్రమ కేసులపై సమావేశంలో చర్చించారు. తెలుగుదేశం హయాంలో దేశంలో తొలిస్థానంలో నిలిచిన రాష్ట్రం... వైకాపా పాలనలో అట్టడుగుకు దిగజారిందనే వాస్తవాన్ని ఇటీవల కొన్ని సర్వేలు బయటపెట్టాయని చంద్రబాబు అన్నారు.
దేశ మ్యాప్‌లో అమరావతి లేకపోవడాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లీ...మళ్లీ పెట్టించారంటూ ఎంపీలను అభినందించారు. అదే స్ఫూర్తిని ఇప్పుడు మళ్లీ చూపాలని..రాజధాని అమరావతి పరిరక్షణకు రైతులు, ఐకాస ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటాన్ని కేంద్రానికి వివరించాలన్నారు. మహిళలపై లాఠీ చార్జ్‌, రైతులపై అక్రమ కేసులు, మహిళలను రాత్రిపూట స్టేషన్లలో నిర్బంధించడం, అన్నదాతల మరణాలపై పుస్తక రూపంలో.. కేంద్ర ప్రభుత్వ ముఖ్యులకు, జాతీయ పార్టీల నాయకులకు, రాజ్యాంగ వ్యవస్థల బాధ్యులకు అందజేయాలని చెప్పారు. ఎంపీ గల్లా జయదేవ్​పై పోలీసుల దాష్టీకాన్ని లోక్‌సభ స్పీకర్​కు ఫిర్యాదు చేయాలన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల దుర్వినియోగంపైనా నేతలు చర్చించారు.

శాసన మండలి రద్దు తీర్మానాన్ని జాతీయ పార్టీల నేతలు, కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్తామని ఎంపీలు స్పష్టం చేశారు. జాతీయ అంశాలైన ఎన్​ఆర్​సీ, ఎన్​పీఆర్​పైనా తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చించారు.

ఇదీ చదవండి: 'రాష్ట్ర వైఖరిని కేంద్రం దృష్టికి తీసుకువెళ్తాం'

పార్లమెంటులో పోరాటం.. తెదేపా నిర్ణయం

AP_VJA_01_29_TDP_Parlamentary_Party_Meeting_PKG_3038097 Reporter:V.SrinivasaMohan Camera:Nagendra Centre:Vijayawada Anchor:::-రాష్ట్ర ప్రభుత్వ అరాచకాలను పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని తెలుగుదేశం పార్టీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు తెలిపారు. రాజధాని మారుస్తామని ఎన్నికల ప్రచారంలోగానీ, మేనిఫెస్టోలోగానీ వైకాపా చెప్పలేదని- ఇప్పుడు ఉన్నఫళంగా పరిపాలన వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానులు దేశంలో ఎక్కడా లేవన్నారు. నక్సలైట్లు, తీవ్రవాదులపై పెట్టే కేసుల్ని అమరావతి రైతులపై పెడుతూ- వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని- సెక్షన్‌ 144, సెక్షన్‌ 30 అమలు, ఇతర అంశాల్లో రాష్ట్ర పోలీసుల చర్యల్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. రాజధానికోసం ఉద్యమిస్తున్న వారిపై పెట్టిన తప్పుడుకేసులన్నీ వెంటనే ఎత్తేయాలని డిమాండ్‌ చేశారు.15 వందల కోట్ల రూపాయలు ఖర్చుచేస్తే, అమరావతిలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలన్నీ పూర్తవుతాయని అభిప్రాయపడ్డారు. శాసన మండలిరద్దు ద్వారా ముఖ్యమంత్రి బీసీలకు తాను వ్యతిరేకినని నిరూపించుకున్నారని ఎంపీలు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం, కోర్టులు చెప్పినా వినకుండా ముఖ్యమంత్రి జాతీయ ఉపాధి హామీ పథకం నిధులను నిధుల్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు....LoooK Vo-1....ఈనెల 31 నుంచి పార్లమెంటు బడ్జెట్‌ సమవేశాలు జరగనున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ తమ సభ్యులతో సమావేశం నిర్వహించింది. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అధ్యక్షతన గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులోని పార్టీ కేంద్ర కార్యాలయంలో తెదేపా లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతోపాటు ఇతర నాయకులు భేటీ అయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తాల్సిన తొమ్మిది ప్రధాన అంశాలపై కూలంకుషంగా చర్చించారు. దిల్లీ పర్యటనలో ఉన్న కారణంగా విజయవాడ ఎంపీ కేశినేని నాని హాజరుకాలేదు. మిగిలిన నలుగురు సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాజధాని అమరావతి మార్పు, మూడు రాజధానుల ప్రకటన, రాష్ట్ర ప్రభుత్వం విధ్వంసర చర్యలు అనుసరిస్తోందని- వీటిపై కేంద్రానికి ఫిర్యాదు చేయాలని సూచించారు. దిగజారిన రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ, ఉపాధి హామీ నిధుల మంజూరు, నిలిచిపోయిన పోలవరం పనులు- వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి- తనకున్న కండిషనబుల్ బెయిల్ షరతులను ఉల్లంఘించి చేస్తున్న ప్రలోభాలు- రాస్తున్న లేఖలు, మీడియా పై - ఆంక్షలు- అక్రమ కేసులు, తెదేపా ప్రజాప్రతినిధులు, నాయకులపై దాడులు, జాతీయ అంశాలైన పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టిక, జాతీయ జన పట్టిక తదితర అంశాలపై ఈ సమావేశంలో విపులంగా చర్చించారు. తెలుగుదేశం పాలనలో దేశంలో తొలిస్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్‌, వైకాపా ప్రభుత్వ ఎనిమిదినెలల పాలనలో వారి నిర్వాకాల వల్ల అట్టడుగుకు దిగజారిందనే- వాస్తవాన్ని ఇటీవల కొన్ని సర్వేలు బయటపెట్టాయన్నారు. దేశ మ్యాప్‌లో రాష్ట్ర రాజధాని అమరావతి లేకపోవడంపై కేంద్రం దృష్టికి తెచ్చి, పార్లమెంటులో పట్టుబట్టి మళ్లీ అమరావతిని మ్యాప్ లో పెట్టించారంటూ పార్టీ ఎంపిలను అభినందించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి, మంత్రి కిషన్‌రెడ్డికి కూడా కృతజ్ఞతలు తెలిపారు. అదే స్ఫూర్తిని ఇప్పుడుమళ్లీ చూపాలని- రాజధాని అమరావతి పరిరక్షణకు రైతులు, ఐకాస ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. రాజ్యాంగ వ్యవస్థల ప్రతినిధులకు వినతులు ఇవ్వాలని చెప్పారు. 43రోజులుగా రాజధాని అమరావతిలో భూములిచ్చిన రైతులు, మహిళలు, రైతు కూలీలు చేస్తున్న ఆందోళనలు, ఆవేదనతో 30మంది పైగా మృతి చెందిన పరిస్థితులు... ఆలయాలకు మొక్కులు తీర్చడానికి వెళ్లే మహిళలపై లాఠీ చార్జి, వందల మంది రైతులను, రైతు కూలీలను జైళ్లకు పంపడం, రాత్రి పదకొండు గంటల వరకు మహిళలను పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం గురించి పుస్తక రూపంలో కేంద్ర ప్రభుత్వ ముఖ్యులకు, జాతీయ పార్టీల నాయకులకు, రాజ్యాంగ వ్యవస్థల బాధ్యులకు అందజేయాలని చెప్పారు. ఐకాస ఆధ్వర్యంలో రైతు సంఘాల ప్రతినిధులు, రైతు కూలీ సంఘాల ప్రతినిధులతో రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గ పాలన గురించి ప్రధానికి, కేంద్ర మంత్రులకు, రాజ్యాంగ వ్యవస్థలకు వినతులు ఇవ్వాలని- మానవ హక్కుల కమిషన్ ,ఎస్సీ, ఎస్టీ కమిషన్, మహిళా కమిషన్ తదితర రాజ్యాంగసంస్థల ప్రతినిధులకు వివరించాలన్నారు. ఎంపీ గల్లా జయదేవ్ పై పోలీసుల దాష్టీకాన్ని లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేయాలన్నారు. జాతీయ సంపద అమరావతిని’ ధ్వంసం చేస్తూ- లక్ష కోట్ల రూపాయల సంపదను నాశనం చేస్తున్నారని చంద్రబాబు ఆవేదన చెందారు. జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల విడుదల గురించి చర్చించారు. byte...గల్లా జయదేవ్‌, గుంటూరు ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, శ్రీకాకుళం ఎంపీ Vo-2...శాసనమండలి రద్దు నిర్ణయం గురించి జాతీయ పార్టీల నాయకులకు, కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. గతంలో రద్దు అయిన మండలి పునరుద్దరణ కోసం 5 రాష్ట్రాలు, కొత్తగా కౌన్సిల్ ఏర్పాటు చేయాలని మరో 5రాష్ట్రాలు అడుగుతుంటే ఉన్న కౌన్సిల్ ను రద్దు చేయడం వైకాపా ప్రభుత్వ తుగ్లక్ చర్యగా చంద్రబాబు విమర్శించారు. ఎనిమిది నెలల్లో 38 బిల్లులను ఆమోదించి- 2 బిల్లులకు సవరణలు ప్రతిపాదించారని- ఇప్పుడొచ్చిన రెండు బిల్లులను సెలెక్ట్ కమిటికి పంపి bytes...కనకమేడల రవీంద్రకుమార్‌, రాజ్యసభ సభ్యుడు తోట సీతామహలక్ష్మి, రాజ్యసభ సభ్యురాలు Evo...కండిషనబుల్ బెయిల్ పై ఉన్న ముద్దాయి తమ కేసుల విచారణలో ఏ దర్యాప్తు అధికారి కావాలో ఏవిధంగా లేఖలు రాస్తారని..? ఇది తన హోదా దుర్వినియోగం చేసి దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేయడం కాదా అని- రాసిన లేఖలను సాక్ష్యంగా చూపించి దిల్లీ స్థాయిలో చర్చ జరిగేలా చూడాలని ఎంపీలకు చంద్రబాబు సూచించారు. మీడియా ప్రతినిధులపై దాడులు, మీడియా ప్రసారాలపై ఆంక్షలు, జీవో 2430 తీసుకురావడం వంటి అంశాలపైనా కేంద్రానికి ఫిర్యాదు చేయాలని చెప్పారు....End
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.