'రాష్ట్ర వైఖరిని కేంద్రం దృష్టికి తీసుకువెళ్తాం' - ఎంపీ రామ్మోహన్ నాయుడు తాజా ఇంటర్వ్యూ
రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితే తెదేపా కచ్చితంగా మద్దతు ఇస్తుందన్నారు ఆ పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు. కానీ వైకాపా ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణ చేస్తోందని మండిపడ్డారు. 3 రాజధానుల అంశంపై ప్రజామోదం లేదన్న ఆయన... ఎక్కడ పనులను అక్కడే ఆపేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నరేగా బిల్లుల చెల్లింపులో రాష్ట్రం వైఖరిని కేంద్రం దృష్టికి తీసుకువెళ్తామని ఆయన ఈటీవీ భారత్తో తెలిపారు.