రాష్ట్రంలో శాంతిభద్రల పరిస్థితిని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లామని తెలుగుదేశం ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర తెలిపారు. మతమార్పిడులు, ఆలయాలపై దాడులు, న్యాయమూర్తులు, ఎస్‌ఈసీ పట్ల ప్రభుత్వ వైఖరిని వివరించామన్నారు. అచ్చెన్నాయుడు అరెస్ట్, పట్టాభిపై దాడి ఘటనను కూడా అమిత్‌షాకు వివరించామన్నారు. వీటన్నింటినీ పరిశీలించి..తగిన చర్యలు తీసుకుంటామని షా చెప్పారని తెదేపా ఎంపీలు తెలిపారు.
ఇదీచదవండి: నాడు-నేడు.. నాణ్యత విషయంలో రాజీపడొద్దు: సీఎం జగన్