దిల్లీలో నిర్వహించిన అఖిలపక్ష భేటీలో తెదేపా ఎంపీలు కనకమేడల రవీంద్ర కుమార్, గల్లా జయదేవ్(TDP MP's in all party meeting held at Delhi) పాల్గొన్నారు. ఇటీవల దక్షిణాఫ్రికాలో కనుగొన్న ఒమిక్రాన్ అనే కొత్త కరోనా వేరియంట్‌పై సమావేశంలో చర్చించారు. అదేవిధంగా.. కేంద్రం పెట్రో ధరలను తగ్గించినప్పటికీ.. అందుకు అనుగుణంగా ఏపీలో ఇంధన ధరలను తగ్గించలేదనే విషయాన్ని సమావేశంలో లేవనెత్తారు.
ఏకీకృత నిబంధన తెచ్చి దేశమంతా ఒకే ధర ఉండేలా చూడాలని వారు కోరారు. విశాఖ ఉక్కు, ఇతర సంస్థల ప్రైవేటీకరణ వద్దని కోరినట్లు తెదేపా ఎంపీలు తెలిపారు. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతి ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి:
BOPPARAJU COMMENTS ON PRC: పీఆర్సీ నివేదిక బయటపెట్టకుండా.. ఉద్యోగులను అవమానిస్తున్నారు: బొప్పరాజు