తూర్పుగోదావరి జిల్లాలో బోటు ప్రమాదం జరిగి 22 రోజులు గడిచినా.. నేటికీ వెలికితీతలో నిర్లక్ష్యం వహిస్తన్నారని తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఆటోల మీద జగన్ ఫోటోలు పెట్టుకోవటానికి, ఆర్టీఏ అధికారులు ఇబ్బంది పెట్టకపోవటానికి మధ్య సంబంధం ఏంటని ఆయన విజయవాడలో జరిగిన సమావేశంలో నిలదీశారు. మరో బోటు ప్రమాదం జరిగి అందులో జగన్ ఫోటో ఉంటే దానిపైనా చర్యలు తీసుకోరా...అని సూటిగా ప్రశ్నించారు. ఫోటో పెట్టుకుంటే చాలు ఎంతటి నేరగాడినైనా వదిలేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ వద్ద మార్కులు పొందాలన్న తాపత్రయంతో... పర్యాటకశాఖ మంత్రి అవంతి జనంలో నవ్వులపాలవుతున్నారని మంతెన దుయ్యబట్టారు.
ఇవీ చూడండి-బోటు ప్రమాదం వెనక రహస్యాలను దాచలేరు: లోకేశ్