MLA Ramanaidu injured: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రమాదవశాత్తు సైకిల్‌పై నుంచి జారిపడ్డారు. తెదేపా హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వాలంటూ ఆయన పాలకొల్లు నుంచి అమరావతిలోని అసెంబ్లీ వరకు సైకిల్ యాత్ర చేపట్టారు. అందులో భాగంగా ఆయన దెందులూరు మండలం శింగవరం వద్ద రోడ్డుపై ప్రమాదవశాత్తు పడిపోయారు. కాగా.. ఆయన ఎడమ కాలికి స్వల్పంగా గాయమైంది. సైకిల్ యాత్రలో పాల్గొన్న ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. స్వల్ప విరామం అనంతరం రామానాయుడు యాత్రను తిరిగి ప్రారంభించారు.
సంబంధిత కథనం:
TDP MLA cycle yatra: అసెంబ్లీకి ఎమ్మెల్యే నిమ్మల సైకిల్ యాత్ర