సోమవారం నుంచి జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల హాజరుపై తుది నిర్ణయం తీసుకునేందుకు.. తెదేపా అధినేత చంద్రబాబు అధ్యక్షతన పార్టీ శాసనసభాపక్షం మధ్యాహ్నం సమావేశం కానుంది. చట్టసభలకు వెళ్లరాదని ఇప్పటికే పొలిట్‌బ్యూరోలో మెజారిటీ నేతల అభిప్రాయం వ్యక్తం చేశారు. గత సమావేశాల్లో జరిగిన అవమానానికి కలత చెంది చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించారు. చంద్రబాబు మినహా మిగిలిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల హాజరుపై పార్టీలో గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. మధ్యాహ్నం ఆన్లైన్ళో జరిగే టీడీఎల్పీ భేటీలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. సభకు హాజరుకాకుంటే ప్రత్యామ్నాయ కార్యక్రమాల నిర్వహణపై.. చంద్రబాబు టీడీఎల్పీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: Reverse Seniority: కొత్త జిల్లాలకు జూనియర్లు.. ఉద్యోగుల సర్దుబాటులో ‘రివర్స్’ సీనియారిటీ