మంత్రి పెద్దిరెడ్డి పీఏ ఏకగ్రీవాల కోసం అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. మంత్రి ఫోన్ కాల్ డేటా పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెదేపా నేతలు వర్ల రామయ్య, బోండా ఉమామహేశ్వరరావు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను శనివారం కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలపై స్పందిస్తూ.. నిష్పాక్షికంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాలన్న హైకోర్టు సూచనను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
''పంచాయతీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున్న హింసాత్మక ఘటనలు, కిడ్నాప్‌లు, నామినేషన్ పత్రాల చించివేత, బలవంతపు ఏకగ్రీవాలు, నామినేషన్లకు అవసరమైన పత్రాలు ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులు పెట్టడం వంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. వీటిని ఇప్పటికే ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువచ్చాం. పుంగనూరు, మాచర్లలో అక్రమాలు జరుగుతున్నాయి. పుంగనూరులో బలవంతపు ఏకగ్రీవాల కోసం మండలం మొత్తానికి ఒకే నామినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పుంగనూరు, తంబళ్లపల్లె, మాచర్ల ప్రాంతాల్లో ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేసి, కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి''
- తెదేపా నేతలు, వర్ల కామయ్య , దేవినేని ఉమ
ఇదీచదవండి.