వైకాపా నేతల అక్రమాలను వెలుగులోకి తెచ్చారనే కక్షతోనే... సంబంధం లేని కేసులను రామకృష్ణారెడ్డిపై బనాయించారని తెదేపా నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జవహర్ మండిపడ్డారు. జగన్ రెండేళ్ల పాలనలో అవినీతి, అక్రమాలు, అరాచకాలు, కక్షసాధింపులకే సరిపోయిందని సోమిరెడ్డి దుయ్యబట్టారు. గొప్ప ప్రజానాయకుడు అయిన తండ్రి మూలారెడ్డి బాటలోనే రామకృష్ణారెడ్డి నడుస్తూ.. మంచి పేరు తెచ్చుకున్నారని చెప్పారు.
అరెస్టులతో రాజ్యాన్ని ఏలాలనుకోవటం ముఖ్యమంత్రి జగన్ అవివేకమే అని జవహర్ అన్నారు. అక్రమ అరెస్ట్‌లతో భయపెట్టడం జగన్ నైజమని విమర్శించారు. అవినీతిని ఎత్తి చూపిన వారిని జైలుకు పంపడమనేది ఎలాంటి ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. చట్టాలకు కావలిగా ఉండాల్సిన పోలీసులు వైకాపాకు కాపలా కాస్తున్నారని జవహర్ దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ మరో బీహార్‌గా మారి ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని అన్నారు.
ఇదీ చదవండి:
పట్టణాల్లో మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణానికి ప్రభుత్వ కార్యాచరణ