ETV Bharat / city

Power Charges: విద్యుత్ ఛార్జీల పెంపుతో పరిశ్రమలు తరలిపోతున్నాయి: తెదేపా నేతలు

author img

By

Published : Sep 7, 2021, 9:29 PM IST

దేశవ్యాప్తంగా విద్యుత్ ఛార్జీలు తగ్గుతుంటే.. రాష్ట్రంలో మాత్రమే పెరుగుతున్నాయని తెదేపా అధికార ప్రతినిధి మహమ్మద్ నజీర్ అహ్మద్ మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యుత్ ధరలు చూసి.. పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయని ఆరోపణలు చేశారు.

tdp leader mohammad nazir fires on ycp govt over hiking power charges
విద్యుత్ ధరల పెరుగుదలతో పరిశ్రమలు తరలిపోతున్నాయి: మహమ్మద్ నజీర్

అందుబాటులోకి వచ్చిన సాంకేతికతతో.. దేశవ్యాప్తంగా విద్యుత్ ఛార్జీలు తగ్గుతుంటే రాష్ట్రంలో మాత్రమే పెరుగుతున్నాయని తెదేపా అధికార ప్రతినిధి మహమ్మద్ నజీర్ అహ్మద్ మండిపడ్డారు. విద్యుత్ వినియోగదారుల్ని.. వైకాపా ప్రభుత్వం ట్రూఅప్ విధానంతో దోపిడీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ ధరలు చూసి.. పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయని ఆరోపించారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి.. రూ.25వేల కోట్ల రుణాలు తెచ్చి కూడా అవసరాలకు తగ్గట్టు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచలేదని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు పెంచనని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్.. రెండున్నరేళ్లలోనే రూ.9,069కోట్లు ప్రజలపై దొడ్డిదారిన భారం మోపారని ధ్వజమెత్తారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించకుంటే.. ప్రజాతిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.

పెంచిన ఛార్జీలు తగ్గించకుంటే తిరగపడతారు: బోండా ఉమా

వైకాపా కమీషన్ల కక్కుర్తి వల్లే.. విద్యుత్ ఛార్జీలు పెరిగాయని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమ ఆరోపించారు. విజయవాడలో విద్యుత్ బిల్లులు తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. పెంచిన ఛార్జీలు తగ్గించకుంటే.. ప్రజలు తిరగపడతారని హెచ్చరించారు. మంత్రి పదవి కోసం వెలంపల్లి ఊడిగం చేస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

Fake Challans: నకిలీ చలాన్ల వ్యవహారం.. ప్రభుత్వం కీలక నిర్ణయం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.