రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘనలు జరగకుండా తక్షణమే జోక్యం చేసుకోవాలని తెదేపా నేతలు.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కోరారు. సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీలు రాజేంద్రప్రసాద్, బుద్ధా వెంకన్న, మంతెన సత్యనారాయణ రాజులు భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నేతలు... రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం నడుస్తోందంటూ ఫిర్యాదు చేశామన్నారు.
'ఎన్నికల సంఘాన్ని నియంత్రించేలా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పంచాయతీ ఎన్నికలు జరగకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు నాయకత్వం వహించే అవకాశాన్ని కోల్పోతారు. ఉద్యోగులను వైకాపా ప్రభుత్వం స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోంది. రాజ్యాంగ సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని కాపాడి, ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు గవర్నర్ జోక్యం చేసుకోవాలి' అని గవర్నర్‌కు ఇచ్చిన లేఖలో తెదేపా పేర్కొంది.
ఇదీ చదవండి: సీఎం జగన్ డైరక్షన్లో రాజ్యాంగ ఉల్లంఘనలు: తెదేపా