TDP leaders fires on YSRCP: రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దివాళా తీసిందంటూ.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆధ్వర్యంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీ వరకు శాసనసభ పక్ష నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం నినాదాలు చేస్తూ కాలినడకన.. సభకు వెళ్లారు. గత బడ్జెట్లో రూ.93వేల కోట్ల బడ్జెట్.. అనుమతి లేకుండా ఖర్చు చేశారని నేతలు మండిపడ్డారు. ప్రభుత్వానికి ఆర్ధిక క్రమశిక్షణ కొరవడిందని నినాదాలు చేశారు. ప్రభుత్వం చేసిన అప్పులు, ఖర్చులపై.. శ్వేతపత్రం విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున పోలీస్ రిక్రూట్మెంట్ చేసిన ఘనత.. తెదేపాదేనని స్పష్టం చేశారు.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంలో.. ముఖ్యమంత్రి వాస్తవాలు కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని.. తెదేపా నేత నిమ్మల రామానాయుడు ఆరోపించారు. సీఎం జగన్.. దేనికీ స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయారని విమర్శించారు. సీఎం వెయ్యి రోజుల పాలన.. నేరాలు, ఘోరాలేనని మండిపడ్డారు. బాబాయి హత్య గురించి సమాధానం చెప్పే ధైర్యం ఆయనకు లేదని రామానాయుడు దుయ్యబట్టారు.
CBI: ఉమాశంకర్రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దు.. సీబీఐ కౌంటర్ పిటిషన్