ETV Bharat / city

ఆ ఎమ్మెల్యే చెప్పింది నిజమే.. లోకల్ మాఫియాతో పోలీసులు చేతులు కలిపారు: వర్ల రామయ్య - ap latest news

tdp leaders fires on bjp and ysrcp: బెయిల్ పై ఉన్నవారంతా జైలుకెళ్తారని భాజపా నేతల వ్యాఖ్యలపై.. తెదేపా నేత వర్ల రామయ్య స్పందించారు. వారంతా జైలుకెప్పుడు వెళతారని నిలదీశారు. నెల్లూరు జిల్లా అధికార పార్టీ ఎమ్మెల్యే చెప్పినట్టుగా.. లోకల్ మాఫియాతో పోలీసులు చేతులు కలిపింది నిజమేనన్నారు.

tdp leaders fires on bjp and ysrcp
వైకాపా, భాజపాలపై తెదేపా నాయకుల ఆగ్రహం
author img

By

Published : Dec 29, 2021, 7:24 PM IST

tdp leaders fires on bjp and ysrcp: బెయిల్ పై ఉన్నవారంతా జైలుకెళ్తారని భాజపా నేతల వ్యాఖ్యలపై స్పందించిన తెదేపా నేత వర్ల రామయ్య.. అదెప్పుడు జరుగుతుందని నిలదీశారు. వివేకా హత్యకేసు దర్యాప్తు తీరుపై.. కేంద్రప్రభుత్వం ఇప్పటివరకు ఎందుకు సమీక్ష చేపట్టలేదని ప్రశ్నించారు. ఎవరిని సంతోషపెట్టడానికి అలా వ్యవహరిస్తోందన్నారు.

నెల్లూరు జిల్లా అధికార పార్టీ ఎమ్మెల్యే చెప్పినట్టుగా.. లోకల్ మాఫియాతో పోలీసులు చేతులు కలిపింది నిజమేనన్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నేరచరితులు రాజకీయాల్లో చేరి, శాసనకర్తలుగా మారకుండా చూడాల్సిన అవసరం ఉందన్న వర్ల.. అందుకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించాలని కోరారు.

రాష్ట్ర వ్యాప్తంగా దళిత ప్రతిఘటన సదస్సులు..
వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. జనవరి 3 నుంచి రాష్ట్రవ్యాప్తంగా దళిత ప్రతిఘటన సదస్సులు నిర్వహిస్తామని తెదేపా ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం.ఎస్ రాజు స్పష్టం చేశారు. ఫిబ్రవరిలో విజయవాడలో దళిత ప్రతిఘటన మహాసభ ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి నాయకత్వంలో అరాచక పాలన సాగుతోందని విమర్శించారు. ఈ అరాచక పాలనకు దళితులు, గిరిజనులు పెద్ద సంఖ్యలో బలౌతున్నారని.. ప్రశ్నిస్తే దాడులు, అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.

దళిత ఓట్లతో అధికార పీఠం ఎక్కిన ముఖ్యమంత్రి.. వారు తలచుకుంటే దిగిపోవాల్సి ఉంటుందని కూడా తెలుసుకోవాలని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా దళితులను చైతన్యం చేసి.. దళిత వ్యతిరేక జగన్ రెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు ఉద్యమాలను సిద్దం చేయడానికే ఈ సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

Dhulipalla Fires On CM Jagan : రూపాయి పెట్టుబడి పెట్టని అమూల్​తో.. రాష్ట్రానికి అప్పులే : ధూళిపాళ్ల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.