రాష్ట్రం పాలిట వైకాపానే ఓ వైరస్‌లా మారిందని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. మంత్రి మోపిదేవి వ్యాఖ్యలపై ధ్వజమెత్తిన తెదేపా నేత కొల్లు రవీంద్ర... వైకాపా నేతల సమావేశాలు, ఊరేగింపుల తర్వాతే ఆయా ప్రాంతాల్లో కరోనా కేసుల ఉద్ధృతి పెరిగిందని ఆరోపించారు. సాక్షాత్తు రాష్ట్ర ప్రథమ పౌరుడు నివసించే రాజ్‌భవన్‌లోనూ కరోనా కేసుల నమోదు అవమానకరమన్నారు.
8వేల కిలోమీటర్లు ఎలా తిరిగారు: అచ్చెన్నాయుడు
రాష్ట్రంలో కరోనా లేదు ఎన్నికలు కావాలని కోర్టుకెళ్లిందెవరని తెదేపా నేత అచ్చెన్నాయుడు నిలదీశారు. లాక్‌డౌన్ అమల్లో ఉన్న 34 రోజుల్లో వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి 3 రాష్ట్రాల్లో 8 వేల కిలోమీటర్లు తిరిగారని ఆరోపించారు. రేషన్‌షాపుల ముందు జనాన్ని గుంపులుగా నిలబెట్టిందెవరని ప్రశ్నించారు.
ఇవీ చదవండి...సీఎం జగన్‌కు ఎమ్మెల్యే ఏలూరి లేఖ