ETV Bharat / city

TDP leaders: దాడిని పరిశీలించకుండా గోడకు నోటీసులు అంటించి వెళ్లడమేంటి..? - panchumarthi anuradha

వైకాపా నేతల(YCP leaders) తీరుపై తెలుగుదేశం నాయకులు(TDP leaders) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలను గంజాయికి(ganja) బలి చేస్తున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్ భవన్ పై జరిగిన దాడిని(assault on NTR bhavan)... పోలీసులు కనీసం పరిశీలించకుండా గోడకు నోటీసులు అంటించి వెళ్లడమేంటని ప్రశ్నించారు.

వైకాపా పాలనపై తెదేపా నేతల ఆగ్రహం
వైకాపా పాలనపై తెదేపా నేతల ఆగ్రహం
author img

By

Published : Oct 23, 2021, 8:13 PM IST

జైలుకు వెళ్లి వచ్చిన జగన్ రెడ్డి(jagan reddy) అందరినీ జైలుకు పంపాలనే కక్షతో రాష్ట్రాన్ని పాలిస్తున్నారని తెదేపా నేత జీవీ ఆంజనేయులు(TDP leader GV anjaneyulu) ఆరోపించారు. దీని కారణంగానే రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా(durugs mafia in andhrapradhesh)పై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆక్షేపించారు. తన పిల్లల్ని బాగా చదివించుకుని విదేశాల్లో స్థిరపడేలా చేసుకున్న ముఖ్యమంత్రి జగన్... రాష్ట్ర ప్రజలను గంజాయికి బలి చేస్తున్నారని తెదేపా రాష్ట్ర కార్యదర్శి పంచుమర్తి అనురాధ(panchumarthi anuradha) ధ్వజమెత్తారు. అమ్మ ఒడి అంటే తన పిల్లల్ని తామే చంపుకునేలా చేయటమా..? అని ప్రశ్నించారు.

గన్నవరం ఎమ్మెల్యే వంశీ(MLA vamshi) ఇంట్లో మంత్రుల అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర(kollu ravindra) ఆరోపించారు. రైస్ మిల్లర్లకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు ఇప్పించేందుకు మంత్రి కొడాలి నాని(minister kodali nani) కమీషన్ అడిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులాన్ని అడ్డంపెట్టుకుని మంత్రి పేర్ని నాని(perni nani) కాలం గడుపుతున్నారని కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ పై జరిగిన దాడిని(assault on NTR bhavan)... పోలీసులు కనీసం పరిశీలించకుండా గోడకు నోటీసులు అంటించి వెళ్లటమేమిటని తెదేపా అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ(sayyad rafi) ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంపై దాడి జరిగి ఐదు రోజులవుతున్నా అసలు దోషుల్ని పోలీసులు అరెస్టు చేయలేదని మండిపడ్డారు.

ఇవీచదవండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.