ETV Bharat / city

TDP leaders : 'ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే.. ఇంట్లో ఫ్యాన్ వేసుకునే పరిస్థితి లేదు'

జగన్ రెడ్డి పాలనపై తెదేపా నాయకులు (TDP leaders) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రెండున్నరేళ్ల పాలనలో ఆరు సార్లు విద్యుత్ ఛార్జీలు(current charges) పెంచారని ధ్వజమెత్తారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే.. ఇంట్లో ఫ్యాన్ వేసుకునే పరిస్థితి లేకుండా చేశారని మండిపడ్డారు.

వైకాపా పాలనపై తెదేపా నేతల ఆగ్రహం
వైకాపా పాలనపై తెదేపా నేతల ఆగ్రహం
author img

By

Published : Oct 10, 2021, 12:24 PM IST

జగన్ రెడ్డి అసమర్థ పాలనతో రాష్ట్రంలో విద్యుత్ రంగం నాశనమైందని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (kommareddy pattabhiram) అన్నారు. విద్యుత్ వ్యవస్థ సరిగా లేకపోతే.. రాష్ట్రానికి పరిశ్రమలు, యువతకు ఉపాధి ఎలా వస్తాయని ప్రశ్నించారు. జగన్ రెడ్డి రివర్స్ గేర్ పరిపాలన(reverse gare ruling)లో ప్రజలు లాంతర్లు పట్టుకొని తిరిగే రోజులు త్వరలోనే వస్తాయన్నారు. వారం రోజుల్లోనే విద్యుత్ అంశంపై ముఖ్యమంత్రి గేర్ మార్చారని ఆక్షేపించారు.

రాష్ట్రంలో అంధకారం..
'జగనన్న బాదుడే బాదుడు' పథకాన్ని వెంటనే రద్దు చెయ్యాలని తెదేపా సీనియర్ నేత జీ.వీ. ఆంజనేయులు(GV.Anjaneyulu) ఎద్దేవా చేశారు. జగన్ చేతికి పవర్ ఇస్తే.. జనానికి పవర్ లేకుండా చేశారని ఎద్దేవా చేశారు. వైకాపా పాలనలో ఇప్పటి వరకు 6 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి, ప్రజలపై అదనపు భారం మోపారని మండిపడ్డారు. సాయంత్రం 6గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఏసీల వినియోగాన్ని తగ్గించాలంటున్న ప్రభుత్వ ప్రకటనను చూస్తుంటే.. త్వరలోనే రాష్ట్రం అంధకారం కాబోతోందన్న విషయం అర్ధమవుతోందన్నారు. కరెంట్ బిల్లులు కట్టడానికి ప్రజలకు జగన్ రెడ్డి అప్పులు(loans) ఇప్పించాలని ఆక్షేపించారు. ఫ్యాన్(fan) గుర్తుకు ఓటేస్తే.. ఇంట్లో ఫ్యాన్ వేసుకునే పరిస్థితి లేకుండా చేశారని జీవీ.ఆంజనేయులు ధ్వజమెత్తారు.

డ్రగ్ డాన్ ఎవరో చెప్పాలి..
ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు(job notifications) ఇవ్వడంలో అట్టడుగు స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్.. ప్రతిపక్ష నేతలకు పోలీసు నోటిసులివ్వటంలో మాత్రం అగ్రస్థానంలో ఉందని తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ(MLC manthena sathyanarayana) మండిపడ్డారు. డ్రగ్స్ అక్రమ రవాణా(drugs transport) చేస్తూ కోట్లు సంసాదిస్తున్న వాళ్లను వదిలేసి.. డ్రగ్ మాఫియాను ప్రశ్నించివారికి నోటీసులిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్ తో చంద్రబాబు(chandrababu), లోకేశ్(lokesh)​కు సంబందాలున్నాయన్న సజ్జల.. తగిన ఆధారాలు చూపాలని డిమాండ్‌ చేశారు. గుజరాత్ ముంద్రా పోర్టు(mundra port)లో పట్టుబడిన హెరాయిన్ పై ధూళిపాళ్ల నరేంద్ర, తెదేపా నేతలు లేవనెత్తిన అనుమానాలను ప్రజలూ వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ప్రజలను మాయ చేయటం మాని ఏపీ డ్రగ్ డాన్ ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇవీచదవండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.