విజయవాడ తెలుగుదేశం పార్టీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. అధినేత చంద్రబాబు పర్యటనపై ఎంపీ కేశినేని నాని తమకు కనీస సమాచారం ఇవ్వకుండా ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తున్నారంటూ పొలిట్‌బ్యూరో సభ్యులు బొండా ఉమా, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, అధికార ప్రతినిధి నాగుల్‌మీరా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
కేశినేని నాని ఆధ్వర్వంలో జరిగే కార్యక్రమంలో తాము పాల్గొనబోమంటూ తిరుగుబాటు ప్రకటించారు. పార్టీకి తాము మాత్రమే విధేయులమని, పదవులకోసం అధిష్టానాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్న నాని... తమను తక్కువ చేసి చూస్తున్నారని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి: