Girl suicide case: విజయవాడలోని భవానీపురంలో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని కుటుంబ సభ్యులను.. తెదేపా అధినేత చంద్రబాబు ఫోన్ ద్వారా పరామర్శించారు. పార్టీ నేత బుద్దా వెంకన్న, రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత.. బాలిక ఇంటికి వెళ్లి పరామర్శించారు. పార్టీలకతీతంగా.. దోషులను కఠినంగా శిక్షించాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. వినోద్ జైన్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేశామని వారు స్పష్టం చేశారు.
కుటుంబ సభ్యులు కోరుకుంటే.. తెదేపా తరపున ప్రత్యేక న్యాయవాదిని నియమిస్తామన్నారు. ఆత్మహత్యను రాజకీయం చేయడం సరికాదని, పార్టీ తరుపున కుటుంబ సభ్యులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని బుద్దా హామీ ఇచ్చారు.
దోషులను కఠినంగా శిక్షించాలని..
బాలిక రాసిన సూసైడ్ నోట్ ప్రకారం దోషులను కఠినంగా శిక్షించాలని.. వంగలపూడి అనిత అన్నారు. అనూష, రమ్యను చంపినవారు బయట తిరుగుతున్నారని, అణగారిన వర్గానికి చెందిన కుటుంబానికి న్యాయం చేయాలని అనిత డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయురాలిగా కూతురును రక్షించుకోలేకపోయానని, పాఠశాలలో పిల్లలను ఎలా రక్షించగలనని మృతురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు మంచి కోరుకుంటారని, చెడు కోరుకోరని ఆమె నమ్మకం వ్యక్తం చేశారు.
వైకాపా ప్రభుత్వానికి.. దళితులు సరైన రీతిలో బుద్ధి చెప్తారు
విజయవాడ పార్లమెంట్ ఏసీ సెల్ ఆధ్వర్యంలో.. నగరంలో దళిత ప్రతిధ్వని సదస్సు కార్యక్రమం నిర్వహించారు. తెదేపా హయంలోనే దళితులకు సముచిత స్థానం లభించిందని.. తెదేపా రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు అన్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం దళితులపై నిర్వహిస్తున్న దమనకాండలకు నిరసనగా.. మార్చి 25న విజయవాడలో దళిత ప్రతిఘటన మహాసభ నిర్వహించనున్నామని ప్రకటించారు. మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన వైకాపా ప్రభుత్వానికి.. దళితులు సరైన రీతిలో త్వరలో బుద్ధి చెప్పనున్నారని.. దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.
సంబంధిత కథనాలు:
STUDENT SUICIDE: బాలిక ఆత్మహత్య కేసు వ్యవహారంలో ఆ పార్టీ నేత సస్పెండ్.. ముమ్మరంగా విచారణ
భవనంపై నుంచి దూకి బాలిక ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏముందంటే ?
సమాజంలో పెద్దమనిషిగా చలామణి... కుమార్తె వయసున్న బాలిక పట్ల వక్ర బుద్ధి