ETV Bharat / city

ఎస్‌ఈసీ మాటలు వినొద్దని సాక్షాత్తూ మంత్రి చెబుతారా?: వర్ల రామయ్య - గవర్నర్​ను కలిసిన తెదేపా నేతలు న్యూస్

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని తెదేపా బృందం గవర్నర్​కు ఫిర్యాదు చేసింది. ఉద్యోగులనుద్దేశించి మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెదేపా బృంధం గవర్నర్​కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా.. ఆయన అందుబాటులో లేకపోవడంతో సెక్రటరీకి ఫిర్యాదు చేసింది.

tdp leaders complaint to governer on minister peddireddy

author img

By

Published : Feb 6, 2021, 2:05 PM IST

Updated : Feb 6, 2021, 2:59 PM IST

గవర్నర్ అపాయింట్​మెంట్ ఇవ్వకపోవడంతో తెదేపా నేతలు ఆయనను మూల విరాట్​తో పోల్చారు. మూల విరాట్ తమను కలవడం లేదని, పూజారిని కలవమని చెప్తున్నారని విమర్శించారు. రెండు మూడు సార్లుగా ఇదే జరుగుతుందని.. వస్తే సెక్రటరీ కూడా ఉండటం లేదని, సెక్రటరీ పీఏకి ఇచ్చి వెళ్లండి అని చెబుతున్నారని పేర్కొన్నారు. గవర్నర్ కోసం వస్తే ఆయన అపాయింట్​మెంట్ ఇవ్వకపోతే ఎవరికి చెప్పుకోవాలని తెదేపా నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.

సీఎం ప్రజలను కలవరు..., గవర్నర్ ప్రజా ప్రతినిధులను కలవరని తెదేపా నేతలు విమర్శించారు. ఈసారి గవర్నర్ అపాయింట్​మెంట్​ ఇవ్వకపోతే.. రాజ్​భవన్ వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఉద్యోగస్తులను బెదిరించిన అంశంలో వెంటనే పోలీసులు పెద్దిరెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పెద్దిరెడ్డి వ్యాఖ్యలను సుమోటగా తీసుకొని చర్యలు తీసుకోవాలని, ఎస్ఈసీ పరిధిలో ఉన్న అధికారులను బెదిరించడం ఏంటని మండిపడ్డారు. రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరుగుతుందని.. అందుకే గవర్నర్ దృష్టికి తీసుకువచ్చినట్లు చెప్పారు. మంత్రిపై చర్యలకు గవర్నర్ సిఫార్స్ చేయాలని డిమాండ్ చేశారు. గవర్నర్​ను కలిసేందుకు తెదేపా నేతలు బోండా ఉమ, వర్ల రామయ్య, బుద్దా వెంకన్న, అశోక్ బాబు, మరెడ్డి శ్రీనివాసరెడ్డి, గద్దె రామ్మోహన్​ వెళ్లారు.

ఇదీ చదవండి: పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎస్‌ఈసీ క్రమశిక్షణ చర్యలు

Last Updated : Feb 6, 2021, 2:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.