రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వ రాత్రిపూట రహస్య జీవోలు విడుదల చేస్తోందని తెదేపా నేతలు ఆరోపించారు. రాష్ట్రంలో బ్లాంక్ జీవోలు ఇచ్చేందుకు వీలు లేదని అన్నారు. జీవోలు ఆన్‌లైన్‌లో ఉంచరాదన్న ప్రభుత్వ నిర్ణయంపై గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌కు తెదేపా నేతలు ఫిర్యాదు చేశారు. పార్టీ నేతలు వర్ల రామయ్య, బోండా ఉమ, బచ్చుల అర్జునుడు తదితరులు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు.
వర్ల రామయ్య మాట్లాడుతూ .. ప్రభుత్వం బ్లాంక్ జీవోలు ఇచ్చేందుకు వీలు లేదని అన్నారు. జీవోలను ఆన్‌లైన్‌లో ఉంచకుండా తేదీ, నెంబరు వేసి వదిలేస్తున్నారని తెలిపారు.
రాత్రిపూట రహస్య జీవోలు విడుదల చేస్తున్నారని విమర్శించారు. జీవోలు ఆన్‌లైన్‌లో పెడతారో లేదో చూసి వారం తర్వాత కోర్టుకి వెళ్తామని తెలిపారు.
బ్లాంక్ జీవోలపై ఫిర్యాదు చేయగానే ఆన్‌లైన్‌లో జీవోలు తీసేశారని బొండా ఉమ తెలిపారు. ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు ప్రభుత్వం భయపడుతోందని ఆరోపించారు.
ఇదీ చదవండి: MLA Parthasarathi: బీసీల సంక్షేమంపై బహిరంగ చర్చకు సిద్ధమా..?