స్థానిక సంస్థల ఎన్నికల(ap municipal elections results) సరళి గమనిస్తే అధికార పార్టీ ఎన్ని నిర్బంధాలకు పాల్పడినా.. ప్రజలు తెదేపా వైపే నిలిచినట్లు స్పష్టమైందని, దీంతో జగన్ ప్రభుత్వ పతనానికి నాంది పడిందని శాసన మండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ‘ఆరు నెలలకు మించి అసెంబ్లీ నిర్వహణకు సమయం తీసుకోరాదన్న రాజ్యాంగ నిబంధన అడ్డు రాబట్టే జగన్‌కు అసెంబ్లీ పెట్టాలన్న ఆలోచన వచ్చింది. జగన్ దిగిపోయే నాటికి రాష్ట్రానికి రూ.6లక్షల కోట్ల అప్పు మిగలనుంది. రూ.లక్ష కోట్లు వడ్డీకే వెచ్చించే దుస్థితికి ఆయన రాష్ట్రాన్ని తీసుకొస్తారు’ అని మండిపడ్డారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం విలేకర్లతో మాట్లాడుతూ.. ‘కొవిడ్ నిబంధన ఏపీ అసెంబ్లీ సమావేశాలకే ఎందుకు అడ్డొస్తుంది? ఇప్పుడు మండలిలోనూ ప్రభుత్వానికే ఆధిక్యముంది. కనీసం 15రోజులైనా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి’ అని డిమాండ్ చేశారు.
అసెంబ్లీని రద్దు చేసి గెలిస్తే తెదేపాను మూసేస్తాం: అచ్చెన్నాయుడు
స్థానిక ఎన్నికల్లో విజయాన్ని వైకాపా నాయకులు డీజీపీకి అంకితమివ్వాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. కుప్పం పురపాలికలో దొంగఓట్లతో గెలిచిన వైకాపా వాళ్లకు ధైర్యముంటే అసెంబ్లీ రద్దుచేసి ప్రజాభిమానంతో గెలవాలని సవాలు విసిరారు. సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా గెలిస్తే తెదేపాను మూసేస్తామని ప్రకటించారు. ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. ‘మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు గమనిస్తే జగన్ పాలనపై ప్రజలు ఎంత వ్యతిరేకతతో ఉన్నారో అర్థమవుతుంది. 7నెలల క్రితం ఎన్నికల్లో మాకు 30% ఓట్లే వచ్చాయని వైకాపానే ప్రకటించింది. ఇప్పుడు మా ఓట్ల శాతం గణనీయంగా పెరిగింది. కుప్పంలో సామ, దాన, భేద, దండోపాయాలు ప్రయోగించి సాధించిన గెలుపూ ఓ గెలుపేనా? తెదేపా కార్యకర్తల పోరాటాన్ని అభినందిస్తున్నా. చంద్రబాబు పని అయిపోలేదు. త్వరలోనే అసలు సినిమా చూపిస్తారు’ అని ప్రశ్నించారు.
ఫ్యాన్‌కి వ్యతిరేకంగా ఓటేశారని బులుగు బుర్రలకెప్పుడు తెలుస్తుంది: లోకేశ్
‘రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఫ్యాన్‌కి వ్యతిరేకంగా ఓటేసి జగన్‌ను తిరస్కరించారనే విషయం బులుగు బుర్రలకి ఎప్పుడెక్కుతుంది..?’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్ (tdp leader nara lokesh on municipal election result news)ప్రశ్నించారు. ‘ప్రజలు లోకేశ్ రెండు చెంపలు పగలగొట్టారనే భ్రమల్లో వైకాపా నేతలు ఉన్నారు. దొంగ ఓట్లు, వందల కోట్లు, గూండాగిరీ, అధికారులు, పోలీసుల అండతో కుప్పంలో గెలిచామని వారు తెలుసుకోవాలి’ అని ట్వీట్ చేశారు.
పెద్దిరెడ్డికి దొంగ ఓట్ల శాఖ అప్పగించాలి: రామానాయుడు
మంత్రి పెద్దిరెడ్డికి దొంగ ఓట్ల శాఖ బాధ్యతలు అప్పగించాలని తెదేపా శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు దుయ్యబట్టారు. ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ‘కుప్పంలో వైకాపా విజయానికి కారణం ప్రజాభిమానం కాదని పెద్దిరెడ్డికి తెలియదా? ప్రజలు వైకాపాను ఆదరిస్తారనే నమ్మకముంటే తెదేపా అభ్యర్థుల నామినేషన్లు ఎందుకు తిరస్కరించారు? దొంగ ఓటర్లను రప్పించి ఓటుకు రూ.10వేలు ఇవ్వటంతో పాటు వారికి వసతి, పోలీసు రక్షణ కల్పించారు’ అని హెచ్చరించారు.
అక్రమాలను నమ్ముకున్నారు: ఎమ్మెల్యే డీబీవీ స్వామి
ప్రజలు తమపై వ్యతిరేకతతో ఉన్నారని తెలిసే.. ప్రభుత్వం దొంగ ఓట్లను, అధికారులను, పోలీసులను నమ్ముకుందని ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి మండిపడ్డారు. ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. ‘గతంలో జరిగిన ఎన్నికల్లో నామినేషన్ల స్థాయిలోనే ప్రభుత్వం ఏకపక్షం చేసుకుంది. ఈ ఎన్నికల ఫలితాల్లో తెదేపాకు ప్రజాదరణ ఉందని తేలిపోయింది’ అన్నారు.
నేతలు సత్కరించాల్సింది డీజీపీని: అశోక్‌బాబు
సంబరపడుతున్న వైకాపా నేతలు సత్కరించాల్సింది ముఖ్యమంత్రిని కాదని, డీజీపీనని ఎమ్మెల్సీ అశోక్‌బాబు(tdp leader ashok babu on municipal elections results సూచించారు. విలేకర్లతో మాట్లాడుతూ ‘కుప్పంలో ఓడిపోతే తెదేపా ఓడినట్లు కాదు. వైకాపా గెలిచినట్లూ కాదు. 2024లో వైకాపా ఆటలు సాగవు. దర్శిలో ఓడినందుకు ప్రకాశం జిల్లా వైకాపా ఎమ్మెల్యేలు, మంత్రి రాజీనామా చేస్తారా..? వైకాపాపై ప్రజా తిరుగుబాటు మొదలైందని ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి’ అన్నారు.
బొత్సకు వైఎస్సార్ ఎప్పుడు మహానుభావుడయ్యారు?: మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి
మంత్రి బొత్స సత్యనారాయణకు వైఎస్సార్ ఎప్పుడు మహానుభావుడయ్యారని తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి(tdp leader marreddy srinivasareddy on municipal elections results) ప్రశ్నించారు. విలేకర్లతో మాట్లాడుతూ ‘వైఎస్ కుటుంబంపై గతంలో చేసిన విమర్శలు మరచి బొత్స మాట్లాడుతున్నారు. తాజా ఎన్నికలతో ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకత బయటకొస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు వైకాపాను నియంత్రిస్తారు. అరాచకాలకు ఎదురొడ్డి తెలుగుదేశం కార్యకర్తలు వీరులుగా నిలిచారు’ అన్నారు.
ఇదీ చదవండి..