తిరుపతి ఉప ఎన్నిక ప్రచార సభలో జరిగిన రాళ్ల దాడిపై.. తెదేపా పోరాటాన్ని పెంచుతోంది. ఈ సాయంత్రం 5.30 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను పార్టీ నేతల బృందం కలవనుంది. అపాయింట్ మెంట్ కోసం నిన్నే గవర్నర్ కు పార్టీ నాయకుడు వర్ల రామయ్య లేఖ రాశారు.
మరోవైపు.. రాళ్లదాడి అంశాన్ని కేంద్ర హోం శాఖ కార్యదర్శి దృష్టికి సైతం తీసుకెళ్లేందుకు తెదేపా ప్రయత్నిస్తోంది. ఈ సాయంత్రం 6 గంటలకు కేంద్ర హోం శాఖ కార్యదర్శిని పార్టీ ఎంపీలు కలవనున్నారు. రాళ్ల దాడి ఘటన వివరాలు తెలియజేయనున్నారు. పోలింగ్ ను కేంద్ర బలగాలతో నిర్వహించాలని కోరనున్నారు.
ఇదీ చదవండి:
చంద్రబాబు ప్రచారంలో రాళ్ల దాడి... గవర్నర్, ఈసీకి ఫిర్యాదు చేసేందుకు నిర్ణయం