ETV Bharat / city

వైకాపా సర్కారుపై ధ్వజమెత్తిన తెదేపా నేతలు

TDP leaders on YCP : జగన్ సర్కార్ పై తెదేపా నేతలు మండిపడ్డారు. ప్రజలు కష్టాలు పడుతుంటే జగన్ పట్టించుకోవడంలేదని ధ్వజమెత్తారు.

TDP leaders
TDP leaders
author img

By

Published : Apr 7, 2022, 6:43 PM IST

TDP leaders on YCP : జగన్ సర్కార్ పై తెదేపా నేతలు మండిపడ్డారు. ప్రజలు కష్టాలు పడుతుంటే జగన్ పట్టించుకోవడంలేదని ధ్వజమెత్తారు.

బేల కబుర్లు, బేల ఏడుపులా -వంగలపూడి అనిత: TDP Vangalapudi Anitha on YCP : ప్రజల కష్టాలు తనవి కావు అన్నట్లుగా వ్యవహరించడం జగన్ కే సాధ్యమని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. ఫ్యానుకు ఓటేసిన పాపానికి.. ఇంట్లో ఫ్యాన్ తిరగకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. దిల్లీ వెళ్లి రాష్ట్ర పరిస్థితుల గురించి చెప్పక.. బేల కబుర్లు, బేల ఏడుపులా? అని నిలదీశారు. డ్వాక్రా మహిళలకు సంబంధించిన 2వేల కోట్ల రూపాయలను.. జగన్‌ తన అకౌంట్లలో వేసుకోవడం దారుణమని అనిత దుయ్యబట్టారు.

బెంజ్ మంత్రి బాగోతమిది -కొల్లు రవీంద్ర : TDP Kollu Ravindra On Minister Jayaram: గత మూడేళ్లలో మంత్రి గుమ్మనూరు జయరామ్ రూ.735కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ "బెంజ్ మంత్రి బాగోతం" పేరిట తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర ఓ నివేదిక విడుదల చేశారు. కార్మిక శాఖ మంత్రిగా ఉండి.. కార్మికుల సంక్షేమం పట్టించుకోకుండా కమీషన్లకే ప్రాధాన్యం ఇచ్చారని దుయ్యబట్టారు. పంచభూతాల్ని సైతం దోచుకున్న మంత్రి గుమ్మనూరు జయరాం అవినీతిని రానున్న రోజుల్లో వదిలిపెట్టబోమనీ.. అన్ని ఆధారాలూ తమ వద్ద ఉన్నాయని కొల్లు రవీంద్ర వెల్లడించారు.

అభివృద్ధిపై చేసిన ఖర్చెంతో చెప్పండి.. - యనమల రామకృష్ణుడు : Yanamala on YCP Ruling: అభివృద్ధి వికేంద్రీకరణ జపం చేస్తున్న జగన్ రెడ్డి.. అభివృద్ధిపై ఖర్చు ఎంత పెట్టారో చెప్పగలరా? అని శాసనమండలి ప్రధాన ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు నిలదీశారు. స్థానిక సంస్థలను బలోపేతం చేస్తున్నామంటూ 14, 15 వ ఆర్ధిక సంఘం నిధులు రూ.7,500 కోట్లు లాక్కున్నారని మండిపడ్డారు. పంచాయతీల సాధారణ నిధులు రూ.3,500 కోట్లు మళ్లించుకోవటాన్ని యనమల తప్పుబట్టారు. ప్రజలపై చెత్తపన్ను వేసి మోయలేని భారాలు మోపారని దుయ్యబట్టారు. జగన్ రెడ్డి మూడేళ్లలో క్యాపిటల్ వ్యయం పై రూ.20 వేల కోట్లు కూడా ఖర్చు చేయకుండా అభివృద్ధి వికేంద్రీకరణ ఎలా చేస్తారని నిలదీశారు. బడుగు బలహీన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు నివసించే ప్రాంతాలలో మౌళిక సదుపాయాల కల్పనకు కేటాయించిన వేల కోట్ల నిధులు దారి మళ్లించారని దుయ్యబట్టారు. అరాచక పాలనపై ప్రజలంతా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి : 24 మంది మంత్రుల రాజీనామా.. ఈనెల 11న కొత్త కేబినెట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.