Buddha Venkanna: ఆర్ఐ అరవింద్‌పై దాడి ఘటనలో కొడాలి నానిని ముద్దాయిగా చేర్చి అరెస్టు చేయాలని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. ఏపీ డేరా బాబాలా కొడాలి నాని వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆర్ఐ అరవింద్‌కు రక్షణగా పోలీసులు వెళ్లకుండా కొడాలి నానితో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. పౌర సరఫరాల శాఖలో కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడిన కొడాలి నాని మట్టి మాఫియా ద్వారా వందల కోట్లు దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. కొడాలి నాని అరాచకాలకు జగన్ భయపడుతున్నారన్నారు. జగన్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో కొడాలి నాని పేకాట శిబిరాలపై పోలీసులు దాడి చేసినా చర్యలు లేవని విమర్శించారు. స్థానిక పోలీసులకు నెలవారీ మామూళ్లు ఇస్తూ కొడాలి నాని వ్యవస్థని గుప్పెట్లో పెట్టుకుని అసాంఘిక కార్యక్రమాలు సాగిస్తున్నారని ఆరోపించారు. మంత్రిగా ఉంటూ క్యాసినో సంస్కృతిని రాష్ట్రానికి తెచ్చి, అసభ్య నృత్యాలతో సొమ్ము చేసుకున్నాడని మండిపడ్డారు.
ఇదీ చదవండి: Rape Incident: విజయవాడ అత్యాచార ఘటన.. నున్న సీఐ, ఎస్ఐలు సస్పెన్షన్