అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్లను అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు కుట్ర పన్ని, కక్షతో బదిలీ చేయించారని తెదేపా నేత వైవీబీ రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. కొవిడ్ ప్రమాదకర సమయంలో ఇద్దరు కలెక్టర్లు కష్టపడి సమర్థవంతంగా పని చేశారన్నారు. తమ సమర్థతో పేద, బడుగు బలహీన వర్గాల ప్రజలకు నూతన పథకాలు పెట్టి, సేవచేసి ఆయా జిల్లాలను అభివృద్ధి చేశారని కొనియడారు. వైకాపా నేతలు చెప్పిన వారికి కాంట్రాక్ట్లు ఇవ్వడం లేదని, అవినీతి పనులకు, దోపిడీ వ్యవహారాలకు మద్దతివ్వడం లేదనే కక్షతోనే ఆ ఇద్దరు కలెక్టర్లను బదిలీ చేయించారని విమర్శించారు.
ఇదీ చదవండీ... Case filed on Somireddy: కృష్ణపట్నం పోర్టు పీఎస్‌లో సోమిరెడ్డిపై కేసు!